Beauty Tips: ఈ చిన్న చిట్కాతో మీ పాదాలు మరింత అందంగా.. పాదాలను అందంగా మార్చుకోవాలనుకుంటే ఇంట్లోనే పెరుగు, పసుపు ముద్దను అప్లై చేసి మసాజ్ చేయాలి. ఇలా చేసిన తర్వాత మాయిశ్చరైజర్ రాస్తే పాదాలు అందంగా మారుతాయి. ఇంకా పాదాల పరిశుభ్రత, అందానికి ప్రతిరోజూ గోరువెచ్చని నీటితో కడగాలని నిపుణులు సూచిస్తున్నారు. By Vijaya Nimma 28 Aug 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Beauty Tips: ఆడవారు ముఖం, చేతులు, మెడ కోసం ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు.. కానీ పాదాల విషయంలో అంత శ్రద్ధ చూపరు. అందంగా కనిపించడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి క్రీములు, లోషన్‌లు రాస్తారు. హెయిర్ కటింగ్‌లో, వస్త్రధారణలో సమ్‌థింగ్ స్పెషల్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తారు కానీ పాదాల విషయంతో చాలా తప్పులు చేస్తారు. అలాంటి వాళ్లు పాదాలను అందంగా మార్చుకోవాలనుకుంటే ఇంట్లోనే అనేక చిట్కాలు ఉన్నాయి. వాటిని పాటించటం వల్ల నల్లగా, మురికితో ఉన్న పాదాలను అందంగా మార్చుకోవచ్చు. పాదాల సమస్యతో చాలామంది ఇబ్బంది పడుతూనే ఉంటాయి. కొన్ని ప్రత్యేక చిట్కాలను అనుసరించడం ద్వారా పాదాలను అందంగా మార్చుకోవచ్చు. ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు కొన్ని విషయాలు ఈ ఆర్టిల్‌లో చూద్దాం. పాదాల అందంల కోసం ఇంట్లో ప్రత్యేక చిట్కాలు: నల్లటి కాళ్ల కారణంగా ఎల్లప్పుడూ ఇబ్బంది పడుతుంటే పెరుగు, పసుపు ముద్దను పాదాలకు అప్లై చేసి మసాజ్ చేయాలి. తర్వాత వాటిని శుభ్రమైన నీటితో కడగాలి. ఇలా చేసిన తర్వాత మాయిశ్చరైజర్‌ని ఉపయోగించాలి. ఇలా చేస్తే పాదాలు అందంగా కనిపిస్తాయి. ఓట్స్, తేనెతో ఒక ప్యాక్ తయారు చేయాలి. దీనిని పాదాలకు అప్లై చేసి మసాజ్ చేయాలి. దీనివల్ల డెడ్ స్కిన్ తొలగిపోయి వాపు తగ్గుతుంది. శనగపిండి, నిమ్మకాయ స్క్రబ్ పాదాలను మెరిసేలా చేస్తుంది. ఇది డెడ్ స్కిన్‌ను తొలగించి పాదాలను శుభ్రంగా, నీట్‌గా కనిపించేలా చేస్తుంది. ప్రతిరోజూ పాదాలను గోరువెచ్చని నీటితో కడగాలి. మాయిశ్చరైజర్ రాసుకోటం, గోర్లు కత్తిరించటం, సరైన బూట్లు ధరించటం వంటి చేయాలి. వీటితోపాటు బయటి నుంచి వస్తున్నప్పుడు పాదాలను కడగాలి. ఇలా చేయటం వల్ల పాదాలను మెరిసేలా చేసుకోవచ్చు. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. ఇది కూడా చదవండి: మీ అధిక బరువుకు PCOD కారణమా.. అయితే ఈ జాగ్రత్తలు తీసుకోండి! #beauty-tips మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి