దుబాయ్‌ను ముంచెత్తిన వరద: రోడ్లపై తేలుతున్న కార్లు, విమానాల రాకపోకలు నిలిపివేత రెండురోజులుగా కుండపోత వర్షాలకు దుబాయ్ చిగురుటాకులా వణుకుతోంది. రోడ్లన్నీ జలమయమైపోయి చెరువులను తలపిస్తున్నాయి. ప్రజలు ఇంటి గడప దాటొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. వరదకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. By Naren Kumar 18 Nov 2023 in ఇంటర్నేషనల్ వైరల్ New Update షేర్ చేయండి Floods in Dubai: ఉరుములు మెరుపులతో కూడిన తీవ్రమైన వర్షం యూఏఈని అతలాకుతలం చేసింది. వరద నీరు దుబాయ్ రహదారులను ముంచెత్తింది. రవాణా, వైమానిక కార్యకలాపాలకు కూడా తీవ్ర అంతరాయం కలిగింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గడప దాటొద్దని దుబాయ్ పోలీసులు హెచ్చరికలు జారీచేశారు. భారీ వర్షాలకు సంబంధించి దుబాయ్ ప్రజలు షేర్ చేసిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. విమానాల రద్దు, మళ్లింపు: ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాలలో ఒకటైన డీఎక్స్‌బీ అంతర్జాతీయ రవాణాకు ప్రధాన కేంద్రంగా ఉంది; వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఆ ఎయిర్‌పోర్ట్‌లో కొన్ని విమానాల రాకపోకలను నిలిపేయగా, మరికొన్నిటిని పొరుగు విమానాశ్రయాలకు మళ్లించినట్లు దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్ ప్రతినిధి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తుండడంతో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, వాహనాలు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవాలని దుబాయ్ పోలీసులు సూచించారు. భద్రత మార్గదర్శకాలను పాటించాలని కోరారు. కొనసాగనున్న వర్షాలు, రవాణాకు ఆటంకం: మరికొన్ని రోజుల పాటు ఆకాశం పాక్షికంగా మేఘావృతమై మరింత వర్షం పడే అవకాశం ఉంది. శుక్రవారం తెల్లవారుజాము నుంచి భారీ వర్షం యూఏఈలో రవాణాకు తీవ్రంగా అంతరాయం కలిగించింది. అయితే, ఈ వారంలో జరగాల్సి ఉన్న ప్రధాన ప్రధాన పారిశ్రామిక ఈవెంట్ అయిన దుబాయ్ ఎయిర్‌షో ప్రణాళిక ప్రకారమే ముందుకు సాగుతుందని అధికారులు తెలిపారు. Major flood on the streets due to heavy rains in the Dubai, UAE Source: Saudi Weather gr #UAE #Dubai #floods #Rains pic.twitter.com/Qtc6spfX9H — Shadab Javed (@JShadab1) November 17, 2023 #breaking-news #floods-in-dubai #uae-floods మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి