Crime News: పిల్లిని కాపాడేందుకు వెళ్లి ఐదుగురు మృతి..!

మహారాష్ట్ర అహ్మద్‌నగర్‌లోని వాడ్కి గ్రామంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. పాడుబడిన బావిలో పిల్లిని కాపాడేందుకు వెళ్లి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు క్షేమంగా బయటపడ్డారు. దీంతో గ్రామంలో, కుటుంబాల్లో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.

New Update
Crime News: పిల్లిని కాపాడేందుకు వెళ్లి ఐదుగురు మృతి..!

Maharashtra: పాడుబడిన బావిలో పిల్లిని కాపాడేందుకు వెళ్లి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకరమైన ఘటన మహారాష్ట్ర అహ్మద్‌నగర్‌లోని వాడ్కి గ్రామంలో చోటుచేసుకుంది. దీంతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. పాడుబడిన బావిలో ఒక పిల్లిలో పడిపోయింది. దీంతో పిల్లిని రక్షించేందుకు ఒకరు బావిలోకి దిగారు. అనంతరం మరొకరు దిగారు. ఇలా ఒక్కొక్కరిగా ఐదుగురు బావిలోకి దిగారు. అయితే, తిరిగి ఒక్కరు కూడా పైకి రాలేదు.

Also Read: అనుచరుడి కోసం రంగంలోకి రేవంత్‌.. ఓ మెట్టు దిగి నేడు రాజగోపాల్ రెడ్డి ఇంటికి..

దీంతో ఐదుగురు తమ ప్రాణాలను బావిలోనే కోల్పోయారు. అయితే, తాడు సాయంతో కిందకి దిగిన వ్యక్తి మాత్రం క్షేమంగా బయటపడ్డాడు. ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఒకేసారి ఐదుగురు ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారన్నారు.


Also Read: డీఎంకే తమిళనాడును లూటీ చేస్తున్న ఓ కంపెనీ.. పీఎం మోదీ సెన్షేషనల్ కామెంట్స్!

పిల్లిని రక్షించే ప్రయత్నంలో బావిలో పడి ఐదుగురు చనిపోయారని అహ్మద్‌నగర్‌లోని నెవాసా పోలీస్ స్టేషన్ సీనియర్ పోలీసు ఆఫీసర్ ధనంజయ్ జాదవ్ తెలిపారు. అంతేకాకుండా పాడుబడిన బావిని బయోగ్యాస్ కోసం జంతువుల వ్యర్థాలతో నిల్వ చేయబడి ఉందని వెల్లడించారు. ఒకరినొకరు పిల్లిని రక్షించడానికి ఆరుగురు వ్యక్తులు దిగారని.. అందులో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. తాడు సాయంతో కిందకి దిగిన వ్యక్తి మాత్రం క్షేమంగా బయటపడ్డాడని పోలీసు అధికారి పేర్కొన్నారు. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడని తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు