Jamili Election: జమిలీ ఎన్నికల సాధ్యాసాధ్యాలపై తొలిసారి భేటి అయిన కోవింద్ కమిటీ

ఒకే దేశం- ఒకే ఎన్నిక(వన్ నేషన్-వన్ ఎలక్షన్) కొన్ని రోజులుగా వినపడుతున్న పదం. దేశవ్యాప్తంగా పార్లమెంట్‌తో అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని ప్రధాని మోదీ ప్రభుత్వం ఎప్పటినుంచో భావిస్తోంది. ఇందుకోసం సాధ్యాసాధ్యాలపై చర్చించేందుకు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీని కూడా ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే.

New Update
Jamili Election: జమిలీ ఎన్నికల సాధ్యాసాధ్యాలపై తొలిసారి భేటి అయిన కోవింద్ కమిటీ

Jamili Election: ఒకే దేశం- ఒకే ఎన్నిక(వన్ నేషన్-వన్ ఎలక్షన్) కొన్ని రోజులుగా వినపడుతున్న పదం. దేశవ్యాప్తంగా పార్లమెంట్‌తో అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని ప్రధాని మోదీ ప్రభుత్వం ఎప్పటినుంచో భావిస్తోంది. ఇందుకోసం సాధ్యాసాధ్యాలపై చర్చించేందుకు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీని కూడా ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి, మాజీ కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్, 15వ ఆర్థిక సంఘం మాజీ ఛైర్మన్ ఎన్‌కే సింగ్, లోక్‌సభ మాజీ జనరల్ సెక్రటరీ సుభాష్ కశ్యప్, సీనియర్ అడ్వకేట్ హరీశ్ సాల్వే, మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారి, న్యాయశాఖా మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఉన్నారు.

ఈ కమిటీ జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై చర్చించేందుకు తొలిసారి ఢిల్లీలో సమావేశం అయింది. ఈ సమావేశంలో వన్ నేషన్- వన్ ఎలక్షన్‌పై కమిటీ సభ్యులు చర్చించారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు, అమిత్ షా, అర్జున్ రామ్ మేఘవాల్‌తో పాటు సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ హాజరయ్యారు. జమిలీ ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీల నుంచి సలహాలు, సూచనలు తీసుకోవాలని నిర్ణయించారు. భారత ఎన్నికల సంఘం, న్యాయ కమిషన్ సహా ఇతర సంస్థల నుంచి అభిప్రాయాలు తెలుసుకునేందుకు చర్చలు జరపాలని ఇందులో నిర్ణయం తీసుకున్నారు.

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు పెట్టడంతో కేంద్రం జమిలీ ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టనుందనే వార్తలు జోరుగా జరిగాయి. అయితే ఈ సమావేశాల్లో కేవలం మహిళా రిజర్వేషన్ బిల్లు మాత్రమే పెట్టడంతో ఆ వార్తలకు ఫుల్ స్టాప్ పడింది. కానీ కేంద్రం మాత్రం ఇప్పుడు కాకపోయినా 2029 ఎన్నికల లోపైనా జమిలీ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది. ఇందుకోసమే ప్రత్యేకంగా ఓ కమిటీని కూడా నియమించింది. పార్లమెంట్ సమావేశాలు ముగిసిన అనంతరం కోవింద్ నేతృత్వంలోని కమిటీ భేటీ కావడం ఆసక్తి రేపుతోంది. అయితే ఈ కమిటీ జమిలీ ఎన్నికల సాధ్యాసాధ్యాలను ముందుగా పరిశీలించి.. సూచనలు, అభ్యంతరాలు తెలుసుకుని ఓ నివేదికను కేంద్రానికి ఇవ్వనుంది. ఈ నివేదిక ఆధారంగా జమిలీ ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకోనుంది.

ఇది కూడా  చదవండి: వారణాసిలో క్రికెట్ స్టేడియాన్ని ప్రారంభించిన ప్రధాని

Advertisment
Advertisment
తాజా కథనాలు