Hyderabad: అంకుర హాస్పిటల్ లో మంటలు హైదరాబాద్ గుడిమల్కాపూర్ లోని అంకుర ఉమెన్ అండ్ చిల్డ్రెన్స్ హాస్పిటల్ లో మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో పేషెంట్లు, వారి బంధువులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. By Naren Kumar 23 Dec 2023 in తెలంగాణ ట్రెండింగ్ New Update షేర్ చేయండి Hyderabad: హైదరాబాద్ గుడిమల్కాపూర్ లోని అంకుర ఉమెన్ అండ్ చిల్డ్రెన్స్ హాస్పిటల్ లో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. హాస్పిటల్ ఐదో ఫ్లోర్ నుంచి పదో ఫ్లోర్ వరకూ మంటల్లో చిక్కుకుపోయాయి. లోపల ఉన్నవారు హాహాకారాలతో బయటకు పరుగులు పెట్టారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిలో ఎక్కువగా గర్భిణులు, చిన్నారులే ఉండడం గమనార్హం. పేషెంట్లు, వారి బంధువులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అప్రమత్తమై అక్కడికి చేరుకున్నారు. నాలుగు ఫైరింజన్లతో మంటలు అదుపులోకి తెచ్చారు. ముందుగా హాస్పిటల్ బోర్డుకు మంటలు అంటుకుని, పక్కనే ఉన్న ఫ్లెక్సీలకు కూడా వ్యాపించడంతో మంటలు భారీగా వ్యాపించాయి. షార్ట్ సర్క్యూట్ తోనే ప్రమాదం జరిగిందని అనుమానిస్తున్నారు. తప్పిన ప్రమాదం: హాస్పిటల్ వెలుపలి భాగం వరకే మంటలు పరిమితం కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఫైర్ సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి సకాలంలో మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. స్థానికులు కూడా అగ్నిమాపక సిబ్బందికి సహకరించారు. ఈ ఘటనలో ఎవ్వరికీ ఎలాంటి ప్రమాదమూ జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. #fire-accident-in-ankura-hospital మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి