ఏపీలో గత అర్ధరాత్రి నుంచి చేపల వేట నిషేధం అమల్లోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 15 నుంచి జూన్ 15 వరకు అంటే సుమారు 61 రోజుల పాటు చేపల వేట నిషేధం అమల్లో ఉంటుంది. మత్స్య సంపదను కాపాడటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా రెండు నెలల పాటూ చేపల వేటపై నిషేధం విధిస్తారు. ఈ రెండు నెలల సమయంలో చేపలు, రొయ్యలు గుడ్లు పెట్టి వాటి సంతాన్నాన్ని అభివృద్ది చేస్తాయి. అందుకే రెండు నెలల పాటు వేటను ఆపేస్తారు.. ఈ సమయంలో మర బోట్లు, ఇంజిన్ బోట్లు వేటకు వెళ్లరాదు. అయితే స్థానికంగా కర్ర తెప్పలకు మాత్రం అనుమతి ఉంటుంది. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటారు.
Also Read:ap: హమ్మయ్యా ఆంధ్ర రొయ్య అమెరికాకు.. కాకపోతే..!
ఈ రెండు నెలల పాటూ అధికారులు మత్స్యకారులు నిబంధనలు ఉల్లంఘించకుండా చూస్తారు. మత్స్యకారులు నిబంధనలు తప్పితే వారిపై కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాదు ప్రభుత్వ పథకాలకు కూడా దూరం అవుతారు. కాబట్టి మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఏపీలో మత్స్యకారులు వేట నిషేధం సమయంలో ఉపాధి కోల్పోతున్నందుకు ప్రభుత్వం వారికి అండగా నిలిచింది.
Also Read:Bangladesh: నిప్పుతో గేమ్స్ వద్దు.. యూనస్‌కు హసీనా వార్నింగ్
గతంలో చేపల వేట నిషేధం 40 రోజులు ఉంటే.. దానిని 60 రోజులకు పెంచారు. గతంలో చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు బియ్యం ఉచితంగా అందించేవారు. ఆ తర్వాత ఆ స్థానంలో మత్స్యకార భరోసా వచ్చింది. 2014లో అప్పటి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.. ఆ తర్వాత బియ్యానికి బదులు రూ.2 వేల చొప్పున సాయం అందించింది.. దానిని రూ.4 వేలుకు పెంచారు. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం మత్స్యకార భరోసాను రూ.10 వేలకు పెంచిన సంగతి తెలిసిందే. 2024 ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం.. తాము అధికారంలోకి వస్తే చేపల వేట నిషేధ సమయంలో ఒక్కో మత్స్యకారునికి రూ.20 వేల చొప్పున పరిహారం అందిస్తామని తెలిపింది.
అందుకు తగిన విధంగా ఈ ఏడాది బడ్జెట్‌లో నిధులు కూడా కేటాయించారు.. ఈ నెల కానీ, మే నెలల ో కానీ మత్స్యకారులకు భరోసా అందిస్తామని ప్రభుత్వం చెబుతోంది. అయితే ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు విడుదల కావాల్సి ఉంది.. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే సర్వే నిర్వహించి లబ్ధిదారుల్ని గుర్తిస్తామని చెబుతున్నారు అధికారులు.
Also Read: America-South Korea: అమెరికా పొమ్మంటుంది... దక్షిణ కొరియా రమ్మంటోంది!
Also Read: America Earth Quake: అమెరికా.. శాన్ డియాగోలో 5.1 తీవ్రతతో భూకంపం
fishing-boat | fishing | 2 months | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates