Filmymoji: కామెడీతో పొట్ట చెక్కలు చేసిన మధు, డూపేశ్‌.. క్లైమాక్స్‌లో మాత్రం ఏడుపొచ్చింది భయ్యా!

ఆవకాయ కోసం అవకాశం కోసం వెయిట్ చేయకూడదు బ్రో.. మనమే క్రియేట్ చేసుకోవాలి లేకపోతే బద్దే మిగులుద్ది బ్రో.. అంటూ ఫిల్మీమోజీ ఎప్పటిలాగే ప్రేక్షకులను యూట్యూబ్‌కు కట్టిపడేసింది. 'సమ్‌థింగ్‌ మిస్సమ్మ' ఫైనల్‌ ఎపిసోడ్‌ రిలీజ్‌ కోసం ఎంతో ఆత్రుతగా వెయిట్ చేసిన ఫిల్మీమోజీ లవర్స్‌ని ఎపిసోడ్‌ ఫుల్‌ మిల్స్‌ ట్రీట్‌ ఇచ్చిపడేసింది. విజయనగరం నుంచి జమ్మలమడుగుకి వెళ్లి చిక్కుకుపోయిన మధు చివరకు తల్లిదండ్రుల వద్దకు చేరాడు. సిరీస్‌ స్టార్టింగ్‌ నుంచి పొట్టచెక్కలయ్యేలా నవ్వించిన ఫిల్మీమోజీ చివరిలో మాత్రం పేరెంట్స్, ఫ్రెండ్స్‌ సెంటిమెంట్ పెట్టి ఏడిపించేసింది.

New Update
Filmymoji: కామెడీతో పొట్ట చెక్కలు చేసిన మధు, డూపేశ్‌.. క్లైమాక్స్‌లో మాత్రం ఏడుపొచ్చింది భయ్యా!

ఫిల్మీమోజీ(Filmymoji) ఎప్పటిలాగే కడుపుబ్బా నవ్వించింది. 'సమ్‌థింగ్‌ మిస్సమ్మ' ఫైనల్‌ ఎపిసోడ్‌ (SomeThing Missamma Final Episode) నెటిజన్లను కట్టిపడేసింది. కామెడీతో మొదలైన ఈ ఎపిసోడ్‌.. చివరిలో అందరిని ఎమోషనల్‌ అయ్యేలాగా చేసింది. తల్లిదండ్రుల ప్రేమ ఎలా ఉంటుందో..కని పెంచిన పిల్లలు దూరమైతే ఎంత తల్లడిల్లిపోతారో.. తమ ప్రాణ స్నేహితుడు కనపడకపోతే స్నేహితులు ఎంతలా బాధపడతారో కళ్లకు కట్టినట్టు చూపించిన ఫిల్మీమోజీ ఎక్కడా కూడా కామెడీ టైమింగ్‌ని మాత్రం మిస్‌ అవ్వలేదు. ముఖ్యంగా ఈ సారి కెమెరామ్యాన్‌ పాత్రలో నటించిన డూపేశ్‌(రూపేశ్‌), అంటుకుల్‌(అంకుల్- కోమలి వాళ్ల నాన్న) పంచ్‌ డైలాగులు ఓ రేంజ్‌లో పేలాయి.

అసలేం జరిగిందంటే:
ఫొటో సెషన్‌ కోసం మధు, మహేశ్‌, బల్లి, బుడద రూపేశ్‌ అనే కెమెరామ్యాన్‌ దగ్గరకు వెళ్తారు. ఈ క్రమంలోనే బయట ఫొటో షూట్‌ ప్లాన్‌ చేసుకుంటారు. విజయనగరంలో అప్పుడే కొత్తగా కట్టిన బ్రిడ్జ్‌పై నుంచి ఫొటో దిగాలని మధు దానిపైకి ఎక్కి బ్యాలెన్స్‌ స్లిప్‌ అవుతాడు. అదే సమయంలో ఓ లారీ రోడ్డుపై నుంచి వెళ్తుండగా అందులో పడిపోతాడు..అటు తిరిగి ఇటు తిరిగి ఆ లారీ రాయలసీమలో జమ్మలమడుగుకు వెళ్తుంది. అక్కడ తన లవర్‌ కోమలి కనిపిస్తుంది. కోమలి వాళ్ల కజిన్‌ పెళ్లి అక్కడే ఉంటుంది. వాళ్ల ఇంట్లోనే మధు ఉండిపోతాడు.

ఎపిసోడ్‌కి ఒక ట్విస్ట్‌తో సాగిందీ సిరీస్‌. చివరగా ఫొటోషూట్‌ చేసిన రూపేశే పెళ్లికూతురితో జంప్‌ అవ్వడం ఈ సిరీస్‌కే హైలెట్‌. ముఖ్యంగా ఫైనల్‌ ఎపిసోడ్‌లో రూపేశ్‌ క్యారక్టర్‌ని ఫిల్మీమోజీ చెక్కిన విధానం నెటిజన్లను ఫిదా చేసింది. అటు కోమలి తండ్రి అంటుకుల్(అంకుల్‌) అయితే నెక్ట్స్‌ లెవల్ కామెడీ పండించాడు. ఈ సిరీస్‌లోని ఆరు ఎపిసోడ్‌లు పదేపదే చూడాలనిపించేలా స్టోరీ రాశారు.

ఎపిసోడ్‌లో నెటిజన్లు కనెక్ట్ అయిన డైలాగులు:

➼ జీయో, ఎయిర్‌టేల్‌ వాడు కూడా బీట్ చేయలేని ప్లాన్ వచ్చింది..ఇది అర్థం కావాలంటే మినిమం డిగ్రీ చదివి ఉండాలి 😃

➼ ఇప్పుడు ఆర్టీసీ ఓపెన్ చేసి వైజాగ్‌కు ట్రైన్లు ఎప్పుడు ఉన్నాయో చూడు.. 😂

➼ ఫ్యూచర్‌లో మావా అని పిలవాలి కాబట్టి సరిపోయింది.. లేకపోతే కుర్చి మడత పెట్టి మింగేవాడిని.. 😃

➼ వీడి బుద్ధిలే వీడి కొడుకుకు వచ్చినట్టున్నాయి.. అతికినట్టుగా అబద్దాలు ఆడేస్తున్నారు.. 😝

➼ అదేమైన కులాయా ఏంటమ్మ అంతసేపు పోసుకోవడానికి? శులభ్‌ కంప్లెక్స్‌ అయితే సులభంగా ఉంటుంది.. 😹

➼ కుటుంబం కుటుంబం రావడానికి ఇక్కడ ఏమైనా భోజనాలు పెడుతున్నారా (బాత్ రూం వద్ద సీన్).. 🙉

➼ ఆవకాయ కోసం అవకాశం కోసం వెయిట్ చేయకూడదు బ్రో.. మనమే క్రియేట్ చేసుకోవాలి లేకపోతే బద్దే మిగులుద్ది బ్రో.. 🤣

➼ ఆవాలు మీద కాలేసి ఇవాళ సాయంత్రం జారిపడి పోయిందట 🙄

ఇక ఎపిసోడ్‌ లాస్ట్‌లో కోమలి భీమలి కాకుండా విజయనగరం వచ్చేసినట్టు చూపించారు. అటు ఈ సిరీస్‌ విలన్‌ పెంటారెడ్డి పగ ఇంకా చల్లారలేదంటూ ఎపిసోడ్‌ని‌ ముగించారు. అంటే ఫ్యూచర్‌లో ఈ సిరీస్‌ పార్ట్‌-2 వచ్చే ఛాన్స్‌ ఉందన్నమాట!

Advertisment
Advertisment
తాజా కథనాలు