Anakapalli: నర్సీపట్నం మున్సిపల్ సమావేశం రాసాభస

అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపల్ సమావేశం రాసాభసగా మారింది. 25 వ వార్డ్ కౌన్సిలర్ టీడీపీ చింతకాయల రాజేష్.. 8 వార్డ్ కౌన్సిలర్ మున్సిపల్ వైస్ చైర్మన్ కోనేటి రామకృష్ణల మధ్య వివాదం జరిగింది. అభివృద్ధిపై రెండు పార్టీల కౌన్సిలర్లు కాలర్లు పట్టుకొని దుర్భషాలాడుకున్నారు.

New Update
Anakapalli: నర్సీపట్నం మున్సిపల్ సమావేశం రాసాభస

Anakapalli: అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపల్ సమావేశం రాసాభసగా మారింది. మంగళవారం సాధారణ సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశం మొదలు కాగానే టీడీపీ నాయకులు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తనయుడు 25 వ వార్డ్ కౌన్సిలర్ చింతకాయల రాజేష్.. 8వార్డ్ కౌన్సిలర్ మున్సిపల్ వైస్ చైర్మన్ కోనేటి రామకృష్ణ ల మధ్య వివాదం నెలకొంది.

Also Read: ఏపీ రాజధానిపై సీఎం జగన్ సంచలన ప్రకటన!

40 ఏళ్లలో టీడీపీ వారు చేయలేని అభివృద్ధి 5సంవత్సరాలలో మేము చేసి చూపించమని మున్సిపల్ వైస్ చైర్మన్ కోనేటి రామకృష్ణ అన్నారు. కొత్త వీధి రోడ్డు నిర్మాణంలో నిబంధనలు పాటించలేదని టీడీపీ కౌన్సిలర్ మధు ముందుగా సమావేశంలో ప్రస్తావించారు. రక్షణ గోడలు నిర్మించుకుండా రోడ్డు వేయడం వల్ల రోడ్డు దెబ్బతింటుందని దీనిపై అధికారులు సమాధానం చెప్పాలని టీడీపీ వారు అడిగారు. ఈ దశలో సమస్యలను గాలికి వదిలేసి పరస్పరం దూషణలకు దిగారు. రెండు పార్టీలకు కౌన్సిలర్ల కాలర్లు పట్టుకొని దుర్భషాలాడుకున్నారు. అనంతరం సభ నుంచి టీడీపీ, జనసేన కౌన్సిలర్లు బయటకు వెళ్ళిపోయారు.

Also Read: మడకశిరలో ఉద్రికత్త.. కార్యకర్త ఆత్మహత్యాయత్నం..!

టీడీపీ, వైసీపీ కౌన్సిలర్ మధ్య గొడవ జరిగే సమయంలో రెండు పార్టీల కౌన్సిలర్లు అడ్డుగా నిలబడి వారించారు. మున్సిపల్ చైర్ పర్సన్ సుబ్బలక్ష్మి పోడియం దిగి కౌన్సిలర్ల మధ్యకు వచ్చి సమావేశం జరిగేలా చూడాలని కోరారు. కొట్లాట సమయంలో తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్ పైల గోవిందరావు సమావేశ మందిరంలోకి వచ్చి వైసీపీ కౌన్సిలర్లతో వాదనకు దిగారు. కౌన్సిల్లో రావడానికి నీకున్న అర్హత ఏమిటని వైసీపీ కౌన్సిలర్లు ప్రశ్నించారు. ప్రజా సమస్యలను ప్రశ్నించే సమయంలో వైసీపీ కౌన్సిలర్లు అడ్డు తగలడం మంచి పద్ధతి కాదని హెచ్చరించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు