Health Tips: చలికాలంలో శరీరాన్ని కాపాడే మెంతి

చలికాలం వచ్చేస్తోంది. అక్టోబర్ నెలాఖరు నుంచి చలి పెరుగుతూనే ఉంటుంది.  చలికాలం చాలా బావుంటుంది. కాస్తంత బద్దకంగా అనిపించినా ఎంజాయ్ చేయడానికి మంచి వెదర్ వింటర్.  చిరు చలిలో వేడి వేడి పదార్ధాలు తిన్నా, తాగినా వచ్చే ఆ మజానే వేరు. అయితే చలి కాలంలో అంతే జాగ్రత్తగా కూడా ఉండాలి. ఇన్ఫెక్షన్లు, ఫ్లూల బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవాలి. చలికాలంలో మెంతి దివ్యౌషధంలా పనిచేస్తుంది. అదెలాగో చూద్దాం రండి.

New Update
Health Tips: చలికాలంలో శరీరాన్ని కాపాడే మెంతి

Fenugreek Leaves: ఏది చేసినా అతి చేయకూడదు, జాగ్రత్తగా చేయాలి. అన్ని కాలాల్లోలాగే వింటర్ లో కూడా మన శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. చలికాలంలో వచ్చే జబ్బుల నుంచి మనల్ని మనం రక్షించుకోవాలి. మంచి, ఆరోగ్యకరమైన ఆహారం తింటూ యాక్టివ్ గా ఉంటే ఏ కాలంలో అయినా ఎంజాయ్ చేయొచ్చు. అవును కదా. మరి చలికాలంలో మన శరీరానికి మేలు చేసే పదార్ధాలు ఏంటో తెలుసా. అన్నింటికన్నా ఎక్కువ ఏది మేలు చేస్తుందో తెలుసా. మనం రోజూ వాడే పదార్ధమే అయినా దానిలో ఉన్న విలువల గురించి చాలా మందికి తెలియదు. అదే మెంతి. మెంతికూర లేదా గింజలు...ఏదైనా సరే చాలా మంచిది.

చలికాలం లో పచ్చటి ఆకు కూరలు బాగా లభిస్తాయి. పచ్చటి మెంతి కూర ఆకులు ఈ వాతావరణం లో లభిస్తాయి. ఈ ఆకుతో కూరవండుతారు. మెంతికూర పెసర పప్పు,మెంతికూర టమాట కాస్త చెడు గా తగిలినా నోటికి రుచిగా ఉంటుంది. మెంతికూర పప్పు అదుర్స్,మెంతికూర పరాటా ఇంకా అదుర్స్ఆరోగ్యానికి మంచిది. మెంతికూర తినడం వల్ల మన శరీరంలోని ఉష్ణోగ్రత పెరుగుతుంది. చలి నుంచి మనల్ని రక్షించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అందుకే నార్త్ ఇండియాలో చలికాలంలో సరసోంకా సాగ్(ఆవాల ఆకు), మెంతికూరలను ఎక్కువగా తింటారు.

Also Read: డిజిటల్ ప్రపంచానికి దూరంగా పిల్లలను పెంచడం ఎలా?

బరువు...

మెంతి ఆకులో పీచు పదార్ధం అధిక మొత్తంలో ఉంటుంది. మెంతి ఆకు తినడం వల్ల మీకు ఆకలి వేయదు. మీపోట్ట నిండుగా ఉంటుంది.మెంతులు కూడా బరువు తగ్గించేందుకు దోహదం చేస్తాయి. మీరు బరువుతగ్గాలంటే (Weight Loss) మీరోజువారీ ఆహారం లేదా డైట్ ప్లాన్ చేసుకోవాలి.

బ్లడ్ షుగర్...

బ్లడ్ షుగర్ (Blood Sugar) కు కూడా మెంతికూర బాగా పనిచేస్తుంది. ఇందులో డయాబెటిస్ ను నియంత్రించే గుణాలు ఉన్నట్లు గుర్తించారు. మీవారానికి రెండు, మూడుసార్లు అయినా మెంతికూర తీసుకుంటే షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయని డాక్టర్లు చెబుతున్నారు. షుగర్ కంట్రోల్ కోసం పరిగడుపున కొన్ని మెంతులు తినాలని వైద్యులు కూడా సూచిస్తుంటారు. మెంతులు కొలెస్ట్రాల్ తగ్గించడంతోపాటు రక్తపోటును మెరుగుపరుస్తుంది.

కొలెస్ట్రాల్...

శరీరంలో బ్లడ్ కొలస్ట్రాల్ (Cholesterol) పెరగితే అనారోగ్య సమస్యలు వస్తాయి. దాన్ని నియంత్రించాలంటే, మనం జబ్బుల బారిన పడకుండా ఉండాలంటే మెంతిని మన ఆహారంలో భాగం చేసుకోవాలి.

నోటి దుర్వాసన...

నోటి నుండి దుర్వాసన వస్తుంటే మెంతి ఆకును తినొచ్చు లేదా మెంతి ఆకులతో టీ చేసుకుని తాగినా ఫలితం ఉంటుంది. అలాగే దంత సమస్యలు ఉన్నా కూడా తొలిగిపోయే అవకాశం ఉంది.

మెంతిఆకు (Fenugreek Leaves) వల్ల ఇన్ని ఉపయోగాలు, లాభాలు ఉంటే మనం రోజూ పోపుల్లో వాడుకునే, మన వంటింట్లో తప్పనిసరిగా ఉండే మెంతులు వల్ల మరిన్ని లాభాలు ఉంటాయి అంటున్నారు నిపుణులు. మరి అవేంటో కూడా ఒకసారి చూసేద్దామా.

1. మెంతిగింజలు ఆకలి, జీర్ణ శక్తిని మెరుగుపరుస్తాయి. అలాగే తల్లిపాల విషయంలో కూడా మెంతి గింజలు సహాయపగతాయి. మహిళల్లో పాల ఉత్పత్తి పెరగడానికి కూడా మెంతులు సహాయపడతాయి.

2. మెంతులు వల్ల మన జుట్టుకు కూడా మంచి లాబాలు ఉన్నాయి. జుట్టు రాలడం, నెరిసిన జుట్టు, యూరిక్ యాసిడ్ స్థాయిలను (Gout) మెంతులు తగ్గిస్తాయి. బ్లడ్ లెవెల్స్ మెరుగుపరిచి రక్తహీనత సమస్యను తొలగిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేయడానికి (డిటాక్సిఫై) కూడా సహాయపడుతుంది. మెంతులు తినడమే కాదు వాటిని ఉడికించిన నీటినో లేదా నానబెట్టి రుబ్బిన గుజ్జునో కూడా మన జుట్టుకు అప్లై చేసుకుంటే జుట్టు బాగా పెరగడమే కాదు నిగనిగలాడుతుంది కూడా. చుండ్రు సమస్య నుంచి కూడా దీంతో తొలగించుకోవచ్చును.

3. న్యూరల్జియా(నరాలవ్యాధి), పక్షవాతం, మలబద్ధకం, కడుపు నొప్పి, ఉబ్బరం తగ్గించడంలో మెంతి దివ్యౌషధంగా పనిచేస్తుంది. వెన్నునొప్పి, మోకాలి కీళ్ళ నొప్పులు, కండరాల తిమ్మిరి, శరీరంలోని ఏ భాగంలోనైనా నొప్పిని నయం చేయడంలో మెంతులు బాగా ఉపయోగపడతాయి.

4. ఇది దగ్గు, ఉబ్బసం, బ్రోంకైటిస్(Bronchitis), ఊపిరితిత్తుల్లో ద్రవాలు, శ్లేష్మం గడ్డ కట్టడం లాంటి వ్యాధుల నుంచి కూడా మెంతులు వల్ల ఉపశమనం లభిస్తుంది.

5. రోజ్‌వాటర్‌తో తయారు చేసిన మెంతికూర పేస్ట్‌ని ముఖంపై సున్నితంగా మర్దన చేయడం వల్ల డార్క్ సర్కిల్స్, మొటిమలు, మొటిమల మచ్చలు, ముడతలు తొలగిపోతాయి. అయితే, వీటిని ఫాలో అయ్యే ముందుప్రతి ఒక్కరు కూడా తమ ఆయుర్వేదిక్ డాక్టర్ ని సంప్రదించాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.

చూశారుగా మెంతికూర లేదా గింజల వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో. మెంతి గింజలు మనం ఎలానో రెగ్యులర్ గా పోపుల్లో, పచ్చళ్ళల్లో వాడుతూనే ఉంటాం. వాటినే మికొంచెం ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది. రోజూ నీళ్ళల్లో నానబెట్టో లేదా ఉడకబెట్టో ఆ నీటిని తీసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి. అలాగే మెంతిఆకును కూడా మన రోజు వారీ డైట్ లో భాగం చేసుకోవాలి. రోజూ తినలేకపోయినా కనీసం వారానికి ఒకసారి అయినా తీసుకోగలిగితే మంచిది.

Advertisment
Advertisment
తాజా కథనాలు