FASTAG : ఫాస్ట్ ట్యాగ్ కేవైసీ అప్డేట్ గడుపు పొడిగింపు ఫాస్టాగ్ కేవైసీ అప్డేట్ చేసుకోవడానికి గడువును పొడిగిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పేటీఎం ఫాస్టాగ్ ట్యాగ్ సమస్యల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. కేవైసీ అప్డేట్ చేసుకోవడానికి మరొక నెల సమయాన్ని ఇచ్చింది. By Manogna alamuru 02 Mar 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి FASTAG KYC Update : ఫాస్ట్ ట్యాగ్(FASTAG) కష్టాలకు కాస్త బ్రేక్ పడింది. కేవైసీ అప్డేట్(KYC Update) చేసుకోవడానికి మరి కొంచెం సమయం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. పేటీఎం లింక్(Paytm Link) వల్ల వస్తున్న సమస్యల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతోంది. ఫాస్ట్ ట్యాగ్ కేవైసీ ని అప్డేట్ కు గత నెల 29నే చివరి తేదీ ఉండగా ఇప్పుడు దాన్ని మరో నెల వరకు పొడిగించింది. దీని ప్రకారం మార్చి 31 వరకు ఫాస్ట్ ట్యాగ్ కేవైసీని అప్డేట్ చేసుకోవచ్చును. ఒక వాహనానికి ఒకే కేవైసీ ఉండేలా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక వాహనం.. ఒక ఫాస్టాగ్ పాలసీని తీసుకొచ్చింది. కేవైసీ పూర్తి చేయకుండానే ఫాస్ట్‌ట్యాగ్‌లు జారీ చేస్తున్నారని అందుకే ఫాస్టాగ్ కేవైసీ ని తప్పనిసరి చేసినట్లు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కీలక ఆదేశాలను జారీ చేసింది. మార్చి 31 తరువాత కేవైసీ అప్డేట్ చేయకుంటే మాత్రం ఫాస్ట్ ట్యాగ్ అకౌంట్ డియాక్టివేట్(FASTAG Account Deactivate) అయిపోతుందని హెచ్చరించింది కేంద్ర ప్రభుత్వం. fastag.ihmcl.com వెబ్సైట్ ద్వారా కేవైసీ అప్డేట్ చేయాలని సూచించింది. కేవైసీ అప్డేట్ కు డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, ఓటర్ ఐడి దేన్నైనా ఇవ్వొచ్చని తెలిపింది. అయితే వీటన్నింటి కంటే రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ తోనే లాగిన్ చేయడం ఉత్తమమని చెబుతోంది. వినియోగదారుడు ముందుగా ఫాస్ట్‌ట్యాగ్‌కు సంబంధించిన అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్టర్ మొబైల్ నెంబర్, పాస్‌వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వాలి. ఓటీపీ అథెంటికేషన్ పూర్తయిన తరువాత.. డాష్‌బోర్డ్‌లో 'మై ప్రొఫైల్' అనే సెక్షన్‌లో కేవైసీ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. కేవైసీ అప్డేట్ ఇలా.. ఫాస్ట్‌ట్యాగ్ కేవైసీ పెండింగ్(FASTAG KYC Pending) లో ఉన్నట్లు కనిపిస్తే.. కేవైసీ సబ్ సెక్షన్ ద్వారా అప్‌డేట్ చేసుకోవచ్చు.దీని కోసం ఐడెంటిటీ ప్రూఫ్.. వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ఫ్రూఫ్‌తో పాటు పాస్‌పోర్ట్ సైజు ఫోటో కూడా ఇచ్చి సబ్మిట్ చేయాలి. దాని తర్వాత కంటిన్యూ పై క్లిక్ చేసి, ఇతర అవసరమైన డాక్యుమెంట్స్ సమర్పించి సబ్మిట్ చేస్తే కేవైసీ వెరిఫికేషన్ పూర్తవుతుంది. Also Read : Breaking : రాజకీయాల నుంచి గౌతమ్ గంభీర్ అవుట్..క్రికెట్‌కే జీవితం అంకితం #fastag-india #fastag-kyc-pending #fastag-kyc-update #paytm-link మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి