Fahadh Faasil : 'పుష్ప' విలన్ కి అరుదైన వ్యాధి.. లైఫ్ లాంగ్ బాధ పడాల్సిందేనట!

ఫహాద్ ఫాజిల్ ADHD(అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్) అనే వ్యాధి బారిన పడ్డారట. ఈ వ్యాధి మెదడు పని తీరుపై తీవ్ర ప్రభావం చూపుతుందట. ఈ వ్యాధి వల్ల ఏకాగ్రత లేకపోవడం, హైపర్ ఆక్టివ్, హైపర్ ఫోకస్ వంటి లక్షణాలు కనిపిస్తాయట.

New Update
Fahadh Faasil : 'పుష్ప' విలన్ కి అరుదైన వ్యాధి.. లైఫ్ లాంగ్ బాధ పడాల్సిందేనట!

Fahadh Faasil Suffering With Rare Disease : 'పుష్ప' సినిమాలో విలన్ గా నటించి తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నారట. ఈ వ్యాధితో జీవితాంతం బాధపడల్సిందేనని, ఈ వ్యాధి తనకు ఉన్నట్లు ఈ మధ్యే తెలిసిందని స్వయంగా ఫహాద్ ఫాజిల్ వెల్లండించడం గమనార్హం.

ఫహాద్ ఫాజిల్ కి అరుదైన వ్యాధి

ఫహాద్ ఫాజిల్ తన 41 ఏళ్ళ వయసులో ADHD(అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్) అనే వ్యాధి బారిన పడ్డారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా బయటపెట్టాడు. ఈ వ్యాధి మెదడు పని తీరుపై తీవ్ర ప్రభావం చూపుతుందట. అయితే తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఫహాద్ ఫాజిల్ వ్యాధికి చికిత్స కోసం డాక్టర్ ని అడిగాడు.

చిన్నతనంలో ఈ వ్యాధి బారిన పడితే నయం చేయొచ్చని, కానీ తనకు 41 ఏళ్ళ వయసులో ఈ వ్యాధి వచ్చిందని దాంతో ఇప్పుడు దీన్ని నయం చేసే అవకాశం లేదని, జీవితాంతం ఈ వ్యాధితో బాధ పడాల్సిందేనని అన్నాడు. ఇక ఈ వ్యాధి సోకడం వల్ల ఏకాగ్రత లేకపోవడం, హైపర్ ఆక్టివ్, హైపర్ ఫోకస్ వంటి లక్షణాలు కనిపిస్తాయట.

Also Read: ‘ఆనంద్ నువ్వు నా ఫ్యామిలీ రా’… వైరలవుతున్న రష్మిక వీడియో

ఇక ఫహాద్ ఫాజిల్ విషయానికొస్తే.. రీసెంట్ గా ఆవేశం (Aavesham Movie) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 30 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 150 కోట్ల వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇక త్వరలోనే 'పుష్ప 2' తో రాబోతున్నాడు. పుష్ప పార్ట్-1 లో కొంతసేపే కనిపించిన ఆయన.. పార్ట్-2 లో మెయిన్ విలన్ రోల్ చేస్తున్నారు. ఆగస్టు 15 న 'పుష్ప 2' థియేటర్స్ లో సందడి చేయనుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు