Face Pack : 7 రోజుల్లో మీ ముఖం రష్మిక మందన లాగా మెరిసిపోవాలా? అయితే ఈ ఫేస్‌ ప్యాక్‌ అప్లై చేయండి!

నిమ్మ రసం, పసుపు , శనగ పిండి ఫేస్‌ ప్యాక్‌తో మీ అందం రెట్టింపు అవుతుంది. మొహం పై డార్క్ స్పాట్స్ తగ్గించడానికి ఈ ఫేస్‌ ప్యాక్‌ సహాయపడుతుంది. శనగ పిండి ఫేస్‌ ప్యాక్‌ తయారీ విధానం కోసం ఆర్టికల్‌లోకి వెళ్లండి.

New Update
Face Pack : 7 రోజుల్లో మీ ముఖం రష్మిక మందన లాగా మెరిసిపోవాలా? అయితే ఈ ఫేస్‌ ప్యాక్‌ అప్లై చేయండి!

Face Beauty : మొహం అందంగా కనిపించాలనే కోరిక అందరికీ ఉంటుంది. దాని ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే సహజంగా మొహం మెరిసిపోవాలంటే శనగ పిండి(Gram Flour) తో చేసిన ఫేస్ అప్లై చేస్తే సరిపోతుంది. వీటి తయారీ విధానం కోసం హెడ్డింగ్ పై క్లిక్ చేయండి.

చాలా మంది ముఖం కాంతివంతంగా, అందంగా, యవ్వనంగా కనిపించాలని రకరకాల బ్యూటీ ప్రాడక్ట్స్(Beauty Products), ఫేస్ ప్యాక్(Face Pack) ఉపయోగిస్తుంటారు. కానీ వీటిలోని కెమికల్స్ కారణంగా కొన్ని సార్లు చర్మానికి హనీ కలిగే అవకాశం ఉంది. అందుకని ఇంట్లోనే సహజంగా దొరికే పదార్ధాలతో మొహాన్ని కాంతివంతంగా తయారు చేసుకోవచ్చు. శనగ పిండితో చేసిన ఫేస్ ప్యాక్స్ మొహానికి అప్లై చేస్తే 7 రోజుల్లో మొహం మెరిసిపోతుంది. ఈ ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

నిమ్మ రసం, పసుపు , శనగ పిండి ప్యాక్
ముందుగా రెండు టేబుల్ స్పూన్స్ శనగ పిండి తీసుకోవాలి. ఆ తర్వాత దాంట్లో చిటికెడు పసుపు , అర టేబుల్ స్పూన్ నిమ్మరసం, అవసరమైతే పెరుగు కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని 20 నిమిషాల పాటు ముఖానికి ప్యాక్ లా అప్లై చేసుకోవాలి. ఇది మొహం పై డార్క్ స్పాట్స్ తగ్గించడానికి సహాయపడుతుంది.

గ్రీన్ టీ, శనగ పిండి ప్యాక్
గ్రీన్ టీ బ్యాగ్(Green Tea Bag) ను వేడి నీళ్లలో నానబెట్టి.. ఆ తర్వాత ఆ నీటిని చల్లార్చాలి. చల్లారిన ఈ నీటిలో ఒక టేబుల్ స్పూన్ శనగ పిండి వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని 15 నిమిషాల పాటు మొహానికి పట్టించి.. ఆ తర్వాత శుభ్రంగా కడిగేయాలి. ఇలా చేయడం ద్వారా మొహం అందంగా, కాంతివంతంగా కనిపిస్తుంది.

టమోటో శనగపిండి ప్యాక్
టమోటో గుజ్జులో 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి కలిపి పేస్ట్ తయారు చేసుకోవాలి . ఈ మిశ్రమాన్ని మొహం పై అప్లై చేసి పది నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత చల్లటి నీటితో శుభ్రంగా కడిగేస్తే సరిపోతుంది. ఇది మొహం పై ముడతలు, ఏజింగ్ సమస్యలను తగ్గిస్తుంది. టమోటో చర్మాన్ని అందంగా మెరిసేలా చేస్తుంది.

Also Read : ఎండాకాలంలో కడుపులో వేడి ఎందుకు పెరుగుతుంది?

Advertisment
Advertisment
తాజా కథనాలు