Somalia : కేఫ్ లో భారీ పేలుడు.. 20 మంది మృతి! సోమాలియా రాజధాని మొగదిషులోని ఓ కేఫ్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు మృతి చెందారు.మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. యూరో 2024 టోర్నీ ఫైనల్‌ను కొందరు వీక్షిస్తున్నప్పుడు ఈ ఘటన జరిగింది. By Bhavana 15 Jul 2024 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి Explosion In Cafe - Somalia : సోమాలియా (Somalia) రాజధాని మొగదిషులోని ఓ కేఫ్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. యూరో 2024 (Euro 2024) టోర్నీ ఫైనల్‌ను కొందరు వీక్షిస్తున్నప్పుడు ఈ ఘటన జరిగింది. సోమాలీ పోలీసు ప్రతినిధి మేజర్ అబ్దిఫితా అడెన్ హస్సా మాట్లాడుతూ.. కొంతమంది కేఫ్ లోపల స్క్రీన్‌పై స్పెయిన్, ఇంగ్లండ్ (England) మధ్య జరిగిన యూరోపియన్ ఫుట్‌బాల్ ఫైనల్ (European Football Final) ను చూస్తుండగా పేలుడు పదార్థాలతో నిండిన కారుతో కొందరు దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో కనీసం 20 మంది గాయపడ్డారని ఆయన వివరించారు. పేలుడు సంభవించిన తరువాత కొందరు కేఫ్ ప్రహారీ గోడను దూకేందుకు ప్రయత్నించిన కొంతమంది గాయపడ్డారని, మరికొందరు తొక్కిసలాటలో గాయపడ్డారని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు.పేలుడు జరిగిన సమయంలో చాలా మంది బాధితులు రోడ్డుపైనే ఉన్నారని తెలిపారు. ఈ దాడికి బాధ్యులెవరో ఇంకా తెలియరాలేదు. Also read: జువాలసిస్ట్ ఆడమ్‌కు 249 ఏళ్ల జైలు శిక్ష…ఎందుకో తెలుసా? #explosion #somalia #cafe #euro-2024 #european-football-final మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి