IMD: రైతులు ఇది మాత్రం చేయకండి.. వాతావరణ శాఖ కీలక సూచనలు దేశవ్యాప్తంగా కుండపోత వర్షాలు పడుతుండటంతో భారత వాతావరణ శాఖ రైతులకు కీలక సూచనలు చేసింది. పంటలను కాపాడుకోవడానికి కొన్ని సలహాలను అనుసరించాలని తెలిపింది. అదే సమయంలో భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. By BalaMurali Krishna 22 Jul 2023 in ఆంధ్రప్రదేశ్ తెలంగాణ New Update షేర్ చేయండి రైతులకు ఐఎండీ సలహాలు.. దేశంలోని పలు ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ(India Meteorological Department) తెలిపింది. ఈ నేపథ్యంలో రైతుల(Farmers)కు కొన్ని కీలక సూచనలు చేసింది. ఇప్పటికే పొలాల్లో వేసిన పంటలను కాపాడుకోవడానికి అగ్రోమెట్ సలహాలను అనుసరించాలని సూచించింది. నీటి స్తబ్దతను నివారించడానికి పంట పొలాల్లో నిల్వ ఉన్న నీటిని తీసివేసేలా జాగ్రత్తలు వహించాలంది. అలాగే కొంకణ్ ప్రాంతంలో బియ్యం, ఫింగర్ మిల్లెట్స్ మార్పిడి.. మధ్య మహారాష్ట్రలోని ఘాట్ ప్రాంతాలతో పాటు విదర్భ, గుజరాత్‌లోని లోతట్టు ప్రాంతాల్లో వరి నుంచి బియ్యం తీయడం వాయిదా వేసుకోవాలని పేర్కొంది. సౌరాష్ట్ర ప్రాంతంలోని ఆముదం, పైగాన్ బఠానీ, గ్రౌండ్‌నెట్, మొక్కజొన్న.. కర్ణాటక తీర ప్రాంతంలో పత్తి, ఎర్ర పప్పు తీయడం ఆపాలంది. ఇక మన తెలంగాణలో కూడా వరి నుంచి బియ్యం తీయడం వాయిదా వేసుకోవాలని రైతులకు సూచనలు జారీ చేసింది. ⚠️ Attention Farmers!⚠️ Excessive rainfall forecasted in several parts of India. Follow these Agromet advisories to safeguard your crops. Stay prepared for heavy downpours! #AgroAlert #CropProtection #WeatherForecast #RainfallAdvisory #FarmersGuidance pic.twitter.com/yWb8udOjw6 — India Meteorological Department (@Indiametdept) July 22, 2023 ఈనెల 25, 26 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ఇక తెలంగాణలో ఈనెల 25, 26 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు(Very Heavy Rains) కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. 115 నుంచి 204 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావొచ్చని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. వరదలు కూడా రావొచ్చని హెచ్చరించింది. వానలు తగ్గే వరకు జాగ్రత్తలు పాటించాలని.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది. అత్యవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని పేర్కొంది. ఎక్కువ నీరు నిల్వ ఉండే ప్రాంతాలకు దూరంగా ఉండాలని చెప్పింది. బంగాళాఖాతంలో సోమవారం మరో అల్పపీడనం ఏర్పడనున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ⚠️ #OrangeAlert ⚠️#Telangana expects Heavy to Very Heavy Rainfall on 25nd and 26th July. Stay Safe! #monsoon2023 #WeatherUpdate #weatherforecast #monsoon #RainfallAlert@moesgoi@DDNewslive@ndmaindia@airnewsalerts pic.twitter.com/pfu0U1lvDu — India Meteorological Department (@Indiametdept) July 22, 2023 తెలంగాణలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్.. అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ, ఆంధ్ర, ఒడిశా, మధ్యప్రదేశ్, కేరళ, కర్ణాటకలలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. దీంతో తెలంగాణలోని పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. 13 జిల్లాలకు ఆరెంజ్, 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గత 24 గంటల్లో కరీంనగర్, మహబూబ్‌నగర్, నిర్మల్, రంగారెడ్డి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిశాయి. ఇటు హైదరాబాద్‌లోనూ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో హుస్సేన్ సాగర్, మూసీ నదుల్లో ప్రవాహం పెరిగింది. అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ అధికారులు హెల్ప్‌లైన్ ఏర్పాటుచేయడంతో సహాయక బృందాలను అలర్ట్ చేసింది. అటు ఏపీలోనూ పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోస్తాంధ్ర, రాయలసీమల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. #farmers #heavy-rains #india-meteorological-department మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి