RRB : అసిస్టెంట్ లోకో పైలట్ పరీక్షా సరళి.. ఇలా చేస్తే ఉద్యోగం మీదే

రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైంది. జూలై, ఆగస్టు మధ్య ఈ పరీక్షలు నిర్వహించనుండగా ఈ ప్రక్రియ 3 దశలుగా విభజించబడింది. ఈ ఉద్యోగం పొందడానికి ప్రిపరేషన్ ప్లాన్, సిలబస్, పరీక్షా సరళి తెలుసుకోవాలంటే హెడ్డింగ్ పై క్లిక్ చేయండి.

New Update
RRB : అసిస్టెంట్ లోకో పైలట్ పరీక్షా సరళి.. ఇలా చేస్తే ఉద్యోగం మీదే

Assistant Loco Pilot: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఇందుకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలవగా.. దీని కోసం CBT 1 పరీక్షను 2024 జూలై, ఆగస్టు మధ్య నిర్వహించనుంది. ఈ పరీక్షకు అర్హత సాధించడానికి అభ్యర్థులు తప్పనిసరిగా 2024 ALP సిలబస్ పూర్తిగా అర్థం చేసుకోవాలి. పరీక్షా సరళి, రిక్రూట్‌మెంట్ ప్రక్రియ 3 దశలుగా విభజించబడింది. అవి. CBT 1, CBT 2 & CBATలుగా ఉన్నాయి. అయితే ఇది కఠినమైన పరీక్ష అయినందువ్లల ఎలా ప్రిపేర్ కావాలి? ఏ సిలబస్‌ను విశ్లేషణాత్మకంగా చదవాలోకూడా బోర్డ్ విశ్లేషించింది.

publive-image

పరీక్షా సరళి పార్ట్ A, పార్ట్ B పద్ధతిలో 2 భాగాలను కలిగి ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (CBAT) పోస్ట్‌లకు ఉత్తీర్ణత సాధించడానికి అభ్యర్థులు పరీక్షలో ప్రతి భాగంలో కనీసం 42 మార్కులు సాధించాలి. అలాగే అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) కోసం టాప్ అభ్యర్థుల జాబితా ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో ఉత్తీర్ణులైన వారి నుంచి తయారు చేయబడుతుంది. ఈ జాబితా రెండవ దశ CBT పార్ట్ A నుంచి 70% మార్కులను, కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ టెస్ట్ నుంచి 30% మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు.

publive-image

గణితం, మెంటల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్, జనరల్ అవేర్‌నెస్ ఉన్నాయి. గణిత శాస్త్ర విభాగంలోని అధ్యాయాలు బాగా సిద్ధం కావాలి. అభ్యర్థులు పరీక్షలలో బాగా స్కోర్ చేయడానికి ఈ అధ్యాయాలపై చాలా ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాలి.

publive-image

CBT 1 (కంప్యూటర్ ఆధారిత పరీక్ష 1)
CBT 2 (కంప్యూటర్ ఆధారిత పరీక్ష 2)
CBAT (కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్)

publive-image

సిలబస్‌ను కవర్ చేయడానికి అధ్యయన ప్రణాళిక:
దేశంలో అత్యంత పోటీ పరీక్షల్లో ఒకటి RRB ALP 2024 పరీక్ష. ప్రతి సంవత్సరం ఈ CBT కోసం పెద్ద సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటారు. కానీ మెరిట్ ఆధారంగా తక్కువ సంఖ్యలో మాత్రమే ఎంపిక అవుతున్నారు. ఫలితంగా అభ్యర్థులు ఇటీవలి RRB ALP సిలబస్‌కు కట్టుబడి అత్యంత కీలకమైన అధ్యాయాలు, అంశాలను మాత్రమే అధ్యయనం చేయాలి. ఇది మీకు RRB ALP CBT 2024 పరీక్షలో ఉత్తీర్ణత సాధించడంలో సహాయపడే అధ్యయన ప్రణాళిక.

publive-image

2024కి సంబంధించిన పరీక్షా సరళిని పరిశీలించి, కీలకమైన సబ్జెక్ట్‌లను గుర్తించండి. మీరు సిద్ధంగా ఉన్నారని నిర్ధారించుకోవడానికి పరీక్ష కోసం ముందస్తు అవసరాలపై అవగాహన పొందండి. ప్రతి సబ్జెక్ట్, అధునాతన అధ్యాయాలకు సంబంధించిన అన్ని ప్రాథమిక అంశాల పునాదులను అర్థం చేసుకోవడానికి అడ్డా రైల్వే మహాప్యాక్ నుంచి వనరులను ఎంచుకోండి. అత్యంత జనాదరణ పొందిన మెటీరియల్ సేకరించి.. మీ బలహీతలను గుర్తించండి. పరీక్షలో మంచి స్కోర్ చేయడానికి గత సంవత్సరం ప్రశ్నపత్రాలను క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేయండి.

ఇక ఈ అసిస్టెంట్ లోక్ పైల్ పోస్టులకు సంబంధించి జనవరి 20న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. ఫిబ్రవరి 18 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అనంతరం ఫిబ్రవరి 20 నుంచి 29 వరకు దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించనున్నారు. మెట్రిక్యులేషన్‌తో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ పూర్తిచేసినవారు ఈ పోస్టులకు అర్హులు. మూడేళ్ల డిప్లొమా (మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌) అర్హత ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజు కింద రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్‌, మైనారిటీ, ఈబీసీ అభ్యర్థులు రూ.250 చెల్లిస్తే సరిపోతుంది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Teachers: ప్రభుత్వ ఉపాధ్యాయులకు బిగ్ అలర్ట్.. బదిలీల షెడ్యూల్ ఖరారు!

ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలపై చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ప్రత్యేక చట్టం తీసుకురాగా మే 30లోపు బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించింది. ఏప్రిల్ 20 నాటికి సీనియారిటీ జాబితా పూర్తిచేసి మెగా డీఎస్సీతో ఖాళీలను భర్తీ చేయనుంది. 

New Update
DSC Posts

AP government key decision on government teachers transfers

Teachers: ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలపై చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ప్రత్యేక చట్టం తీసుకొచ్చింది. మే 30 లోపు బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించింది.  ఏప్రిల్ 20 నాటికి సీనియారిటీ జాబితా పూర్తిచేసి మెగా డీఎస్సీతో ఖాళీలను  భర్తీ చేసేందుకు సిద్ధమైంది. 

GO-117 రద్దు..

ఈ మేరకు ఈ చట్టం ప్రకారం మొదటిసారి బదిలీలు చేయనుండగా GO-117ను రద్దు చేశారు. దీనికి ప్రత్యామ్నాయంగా తీసుకునే చర్యలపై ఇప్పటికే క్షేత్రస్థాయిలో అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. ఈసారి తీసుకురాబోతున్న ఆదర్శ ప్రాథమిక పాఠశాలల విధానంలో అందుకు అనుగుణంగా ఉపాధ్యాయుల సర్దుబాటు చేయనున్నారు. 7,500పైగా ఆదర్శ ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటయ్యే అవకాశం ఉండగా.. 1-5 తరగతులకు 5గురు టీచర్లను  కేటాయిస్తూ ఈ విధానాన్ని తీసుకురానున్నారు. ఈ ప్రక్రియ ఇప్పటికే 95% పూర్తి చేయగా.. 430 బడులకు సంబంధించి ఫనల్ చేయాల్సివుంది.  వార్డు, గ్రామ పంచాయతీకో బడి ఏర్పాటు చేసి మే 30 వరకు బదిలీల అంశాన్ని పూర్తి చేయనున్నట్లు సమాచారం. అలాగే సీనియారిటీ టీచర్ల జాబితాను ఏప్రిల్ 20వరకు సే పూర్తి చేయనున్నారు. 

ఇది కూడా చూడండి: Kerala: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!

ఇక బదీలల ప్రక్రియ ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించనున్నారు. ఖాళీల ఆధారంగా ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. ఒక టీచర్‌ ఎన్ని ఆప్షన్స్ అయినా ఎంచుకోవచ్చు.  సీనియారిటీ, రిజర్వేషన్‌ రోస్టర్‌ ప్రకారం పోస్టులు కేటాయించనున్నారు. తప్పనిసరిగా బదిలీ అయ్యే టీచర్లు తాము పనిచేస్తున్న పాఠశాలలో మళ్లీ పనిచేసే అవకాశం ఉండదు. 2 సంవత్సరాలు సర్వీసు పూర్తిచేసుకున్నవారు నచ్చిన పాఠశాలను ఎంచుకోవచ్చు. మొదట ప్రధానోపాధ్యాయుల బదిలీలు ఉంటాయి. ఆ తర్వాత స్కూల్‌ అసిస్టెంట్లకు పదోన్నతులుంటాయి. స్కూల్‌ అసిస్టెంట్లకు బదిలీలు నిర్వహించి, ఎస్జీటీలకు పదోన్నతులు కల్పించనున్నారు. చివరిగా SGTలకు బదిలీలు నిర్వహిస్తారు.

ఇది కూడా చూడండి: WhatsApp new features: వాట్సాప్‌ వీడియో కాల్స్ చేసుకునే వారికి గుడ్‌న్యూస్.. కొత్తగా 3 ఫీచర్లు!

 transfer | cm-chandrababu | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment