Perni Nani: దమ్ముంటే జగన్ సమాచారం బయటపెట్టు..పవన్ కు పేర్నినాని సవాల్

తాడేపల్లిగూడెం సభలో జనసేన పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి పేర్నినాని మండిపడ్డారు. కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడి రథ సారథిగా వ్యవహరించిన శల్యుడితో పవన్ కల్యాణ్ ను పోల్చారు. శల్యుడిలా అందరినీ నిర్వీర్యం చేస్తాడని విమర్శలు గుప్పించారు.

New Update
Perni Nani: దమ్ముంటే జగన్ సమాచారం బయటపెట్టు..పవన్ కు పేర్నినాని సవాల్

Ex Minister Perni Nani: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లకు కాపులు ఓట్లు కావాలని కాని..కాపుల ఆత్మ గౌరవాన్ని పెంచే ఒక్క మాట అయినా మాట్లాడారా? అని ప్రశ్నించారు మాజీ మంత్రి పేర్ని నాని. జగన్ గురించి నాకు తెలుసు అని పవన్ చెప్పడం ఎందుకు.. జగన్ గురించి సమాచారం వుంటే బయటపెట్టు అని సవాల్ చేశారు. నీ దగ్గర సమాచారం ఏమి చేసుకుంటావో చేసుకో అని తేల్చిచెప్పారు.

Also Read: జీ న్యూస్‌-మ్యాట్రిజ్‌ సంచలన సర్వే .. ఏపీలో గెలిచేది ఎవరంటే?

2019లో జగన్, పవన్ కళ్యాణ్ ను మడిచి తోంగో బెట్టారని విమర్శించారు. 2019లో అమరావతి ఒక కులానికి రాజదాని అని పవన్ చెప్పారని.. అయితే, ఆ రోజుకి ఈ రోజుకి చంద్రబాబు, పవన్ కు మధ్య ఏమి జరిగిందోనని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ఎన్ని సీట్లు తీసుకుంటే మాకేంటి? 24 కాకపోతే నాలుగు తీసుకోని అని అన్నారు. సీట్ల విషయంలో జనసేన నేతలకు, కార్యకర్తలకు, హరిరామ జోగయ్య, ముద్రగడ లాంటి కాపులకు బాధ వుండొచ్చని అన్నారు.

Also Read: ఫ్లవర్ రోజా..ప్రజల చెవిలో పువ్వులు పెట్టొద్దు: రవినాయుడు

తాడేపల్లిగూడెం సభలో జనసేనాని పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడి రథ సారథిగా వ్యవహరించిన శల్యుడితో పవన్ ను పోల్చారు. పపన్ కల్యాణ్ తనను తాను వామనుడితో పోల్చుకుంటున్నాడని, కానీ పురాణాల్లో శల్యుడి పాత్ర ఒక్కటే పవన్ కళ్యాణ్ కు సరిపోతుందని వ్యంగ్యంగా మాట్లాడారు. శల్యుడి తరహాలోనే పవన్ పార్టీని, పార్టీ నేతలను నిర్వీర్యం చేసేందుకు పూనుకున్నాడని పేర్ని నాని వ్యాఖ్యానించారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP: చికిత్స తర్వాత ఇండియాకు తిరిగి వచ్చిన మార్క్ శంకర్..

సింగపూర్ స్కూల్లో మంటల్లో గాయాలపాలై ఏపీ డిప్యూటీ సీఎవ కుమారుడు మార్క్ శంకర్...చికిత్స అనంతరం ఇండియాకు తిరిగి తీసుకువచ్చారు. పవన్ కల్యాణ్, ఆయన భార్య అన్నా లెజినోవాలు తమ కుమారుడితో కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ కు చేరుకున్నారు.

author-image
By Manogna alamuru
New Update
ap

Mark Shankar

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నాడు. అతనిని కొద్దిసేపటి క్రితమే ఇండియాకు తిరిగి తీసుకుని వచ్చారు. పవన్ కల్యాణ్, ఆయన భార్య అన్నా లెజినోవాలు తమ కుమారుడు మార్క్ శంకర్ తో కలిసి హైదరాబాద్ కు చేరుకున్నారు. చికిత్స అనంతరం బాబు కోలుకున్నాడని తెలుస్తోంది. అయితే కొద్ది రోజులు విశ్రాంతి అవసరమని..అందుకే ఇండియాలో ఇంట్లోనే ఉంచి జాగ్రత్తలు తీసుకోనున్నారని చెబుతున్నారు. 

today-latest-news-in-telugu | deputy-cm-pawan-kalyan | pawan kalyan son mark shankar

Also Read: BRS: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి మంజూరు..!

Advertisment
Advertisment
Advertisment