Jagan: నేడు నెల్లూరు జైలుకు జగన్.. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లితో ములాఖాత్! AP: ఈరోజు నెల్లూరు జిల్లాకు మాజీ సీఎం జగన్ వెళ్లనున్నారు. నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించనున్నారు. ఈవీఎం ధ్వంసం కేసు సహా మరో మూడు కేసుల్లో పిన్నెల్లిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. By V.J Reddy 04 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి YS Jagan: ఈరోజు నెల్లూరు జిల్లాకు మాజీ సీఎం జగన్ వెళ్లనున్నారు. నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని (Pinnelli Ramakrishna Reddy) పరామర్శించనున్నారు. హెలికాప్టర్ ద్వారా పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌కి, అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా చెముడు గుంటలో ఉన్న జిల్లా సెంట్రల్ జైలుకి వెళ్లనున్నారు మాజీ సీఎం. ఎన్నికల ఘర్షణల కేసులో అరెస్టయి పిన్నెల్లి జైలులో ఉన్నారు. ఎన్నికల ఫలితాల తరువాత పులివెందులలోపర్యటించారు జగన్.. ఆ తరువాత బెంగళూరులోని తన నివాసంలో కొన్ని రోజులు ఉండి.. తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. ఇదిలా ఉంటే మొత్తం నాలుగు కేసుల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించిన విషయం తెలిసిందే. పిన్నెల్లిపై ఉన్న మూడు కేసులు ఇవే.. * కేసు నంబర్ 1: ఈవీఎం ధ్వంసాన్ని అడ్డుకున్న శేషగిరిరావుపై దాడి * కేసు నంబర్ 2: ప్రశ్నించిన మహిళపై దుర్భాష * కేసు నంబర్ 3: కారంపూడి సీఐపై దాడి * కేసు నంబర్ 4: టీడీపీ కార్యకర్తపై దాడి Also Read: పిఠాపురంలో స్థలం కొన్న పవన్ కళ్యాణ్.. ఇకపై అక్కడే! #jagan సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి