Hemant Soren: హేమంత్‌ సోరెన్‌ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

మనీలాండరింగ్ కేసులో రెగ్యులర్ బెయిల్‌ను కోరుతూ మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌ వేసిన పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేసేందుకు జార్ఖండ్ హైకోర్టు జూన్ 10 వరకు ఈడీకి గడువు ఇచ్చింది. తదుపరి విచారణను వచ్చే నెల 10కి వాయిదా వేసింది.

New Update
BIG BREAKING: మాజీ సీఎం హేమంత్ సోరెన్‌కు బెయిల్!

Hemant Soren Bail Petition: మనీలాండరింగ్ కేసులో రెగ్యులర్ బెయిల్‌ను కోరుతూ మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌ వేసిన పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేసేందుకు జార్ఖండ్ హైకోర్టు జూన్ 10 వరకు ఈడీకి గడువు ఇచ్చింది. తదుపరి విచారణను వచ్చే నెల 10కి వాయిదా వేసింది. కాగా భూ కుంభకోణం కేసులో తనకు రెగ్యులర్ బెయిల్ కావాలంటూ మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌ సోమవారం జార్ఖండ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

ప్రచారానికి నో పర్మిషన్..

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భూ కుంభకోణానికి సంబంధించి మధ్యంతర బెయిల్‌ కోసం జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ వేసిన పిటిషన్‌పై రెండు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని సుప్రీంకోర్టు మే 17న ఆదేశించింది. సంక్షిప్త విచారణ సమయంలో, ED సోరెన్ అభ్యర్థనను వ్యతిరేకించింది, సాధారణ ఎన్నికల తేదీలు ప్రకటించకముందే అతన్ని అరెస్టు చేశారని వాదించారు. కాగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఎన్నికల ప్రచారం చేసేందుకు మధ్యంతర బెయిల్ ఇచ్చిన మాదిరి మాజీ సీఎం హేమంత్ సొరేన్ కు కూడా ఎన్నికల ప్రచారానికి అనుమతి ఇవ్వడానికి నిరాకరించింది సుప్రీం కోర్టు.

Also Read: డేరా బాబా నిర్దోషి.. ఆ హత్యకేసులో హైకోర్టు సంచలన తీర్పు!

Advertisment
Advertisment
తాజా కథనాలు