YSRCP: వైసీపీ లో చేరిన బళ్ళారి మాజీ ఎంపీ శాంతమ్మ

బళ్ళారి మాజీ ఎంపీ శాంతమ్మ సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. వైసీపీ సిద్దాంతాలు, పనులు చూసి పార్టీలో చేరినట్లు తెలిపారు. దేశంలో ఏ పార్టీ చేయని సంక్షేమ కార్యక్రమాలు సీఎం జగన్ చేస్తున్నారని కొనియాడారు.

New Update
YSRCP: వైసీపీ లో చేరిన బళ్ళారి మాజీ ఎంపీ శాంతమ్మ

Ex BJP MP Shanthamma: సీఎం జగన్ సమక్షంలో వైసీపీ లో చేరారు బళ్ళారి మాజీ ఎంపీ శాంతమ్మ. గతంలో బీజేపీ ఎంపీగా శాంతమ్మ పని చేశారు. అనంతరం మాజీ ఎంపీ శాంతమ్మ మీడియాతో మాట్లాడారు. వైసీపీ సిద్దాంతాలు, పనులు చూసి పార్టీలో చేరినట్లు తెలిపారు. దేశంలో ఏ పార్టీ చేయని సంక్షేమ కార్యక్రమాలు సీఎం జగన్ చేస్తున్నారని కొనియాడారు. దేశమే జగన్ వైపు చూస్తుందని పేర్కొన్నారు. వైసీపీ లో సామాన్య కార్యకర్తగా పని చేస్తానని అన్నారు. పార్టీలో పెద్దలు నన్ను ఆశీర్వదించాలని అన్నారు. అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ ప్రతి ఇంటికి పెద్ద కొడుకులా కష్ట పడుతున్నారని తెలిపారు. వైసీపీ లో చేరడం అదృష్టం గా భావిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. జగన్ వాల్మీకి లకు ప్రత్యేక స్థానం ఇచ్చారని.. సామాన్య కార్యకర్తగా పని చేస్తానని వెల్లడించారు. టికెట్ విషయంలో హై కమాండ్ నిర్ణయం ప్రకారం నడుచుకుంటా అని స్పష్టం చేశారు.

ALSO READ: BRS మాజీ ఎమ్మెల్యే షకీల్ పై కేసు నమోదు

మరోవైపు విశాఖలో సీఎం జగన్ కు షాక్..

ఏపీలో అధికార వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. విశాఖలో పార్టీకి చెందిన ముఖ్యనేత, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను వైసీపీ అధినేత, సీఎం జగన్‌కు పంపించారు. అయితే, తనకు టికెట్ రానుందనే దాడి విరభద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి దాడివీరభద్రరావు అనకాపల్లి టికెట్‌ను ఆశించారు. అయితే, టికెట్ దక్కే అవకాశం లేకపోవడంతో పార్టీ మారాలని భావించారు. ఈ క్రమంలో తన కార్యకర్తలతో అనకాపల్లిలో కీలక సమావేశం నిర్వహించారు. తన నిర్ణయంపై కార్యకర్తలతో చర్చించారు. పార్టీలో తనకు గుర్తింపు లేదని వీరభద్రరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తంతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ వైసీపీకి రాజీనామా చేశారు దాడి వీరభద్రరావు. తన రాజీనామా కాపీని సజ్జల రామకృష్ణా రెడ్డి, విజయసాయి రెడ్డిలకు కూడా పంపారు. కాగా, విశాఖ రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డికి మాత్రం ఆయన తన రాజీనామా లేఖను పంపలేదు.

ALSO READ: రాక్ష‌స పాల‌న‌లో అమ్మాయిలకు రక్షణ లేదు.. జగన్ పై లోకేష్ ఫైర్

తెలుగుదేశం పార్టీలో టాప్ లీడర్‌గా ఉన్న దాడి వీరభద్రరావు.. అనేక పదవులు చేపట్టారు. ఆ తరువాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన టీడీపీని వీడి వైసీపీలో చేరారు. గత ఎన్నికల్లో అనకాపల్లి కాకుండా.. విశాఖ ఉత్తర నియోజకవర్గాన్ని వీరభద్రరావు కుమారుడు రత్నాకర్ కు కేటాయించింది వైసీపీ. అయితే, అక్కడ అతను ఓటమిపాలయ్యాడు. ఇప్పుడు మరోసారి పోటీకి సిద్ధపడుతుండగా.. పార్టీ హైకమాండ్‌ నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. దీంతో దాడివీరభద్రరరావు తీవ్ర అసంతృప్తికి లోనై.. పార్టీ మారేందుకు నిర్ణయం తీసుకున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు