Bigg Boss Telugu 8: 'దేకో దేకో బిగ్ బాస్ మస్త్ ఆట'.. కలర్ ఫుల్ గా బిగ్ బాస్ ప్రోమో వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సరికొత్త సీజన్ తో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమవుతోంది. తాజాగా మేకర్స్ సీజన్ 8 ప్రోమోను రిలీజ్ చేశారు. కమెడియన్ సత్య డైలాగ్స్, బిగ్ బాస్.. బిగ్ బాస్ అంటూ సాగే పాటతో కలర్ ఫుల్ ప్రోమో ప్రేక్షకులను అలరిస్తోంది. By Archana 13 Aug 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Bigg Boss Telugu 8: బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 'ఇక్కడ ఒక్కసారి కమిటైతే లిమిటే లేదు.. లిమిట్ లెస్ ఫన్, డ్రామా, ఎంటర్ టైన్మెంట్ అంటూ ఇప్పటికే విడుదలైన సీజన్ 8 టీజర్ ప్రేక్షకులలో ఆసక్తిని పెంచగా.. తాజాగా ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. సీజన్ 8 ప్రోమో ఈ ప్రోమోను నాగార్జున, కమెడియన్ సత్య దేవ్ డైలాగ్స్, కొంత మంది అమ్మాయిల నృత్య ప్రదర్శనలు, పాటలతో ఆసక్తికరంగా చిత్రీకరించారు. ఎంటర్ టైన్మెంట్, ట్విస్ట్స్, టర్న్స్, ఫన్, కు లిమిటే లేదు అనే కాన్సెప్ట్ తో విడుదలైన ఈ ప్రోమో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ప్రోమోలో 'దేకో దేకో బిగ్ బాస్ మస్త్ ఆట' అంటూ సాగే బిగ్ బాస్ జింగిల్ షో పై ఆసక్తిని పెంచుతోంది. ఇక సీజన్ 8 కంటెస్టెంట్స్ విషయానికి వస్తే.. ఊహించని వ్యక్తులు కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో పలువురి పేర్లు వైరలవుతున్నాయి. సీరియల్ నటి తేజశ్విని, ఏక్ నాథ్- హారిక కపుల్, బర్రెలక్క, కుమారి ఆంటీ, విష్ణు ప్రియా, రీతూ చౌదరీ, వేణు స్వామీ, కిర్రాక్ ఆర్ఫీ , అంజలి పవన్, నిఖిల్, శ్వేతా నాయుడు , రాజ్ తరుణ్ సీజన్ 8 లో పాల్గొనబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. Eesari entertainment ki, fun ki, twists & turns ki limit ee ledu! In continuation to the Bigg Boss season 8 teaser, here is the promo!! Meeru ready ah?https://t.co/A6q4zx9AfJ Bigg Boss Season 8 is COMING SOON!#BiggBossTelugu8 @StarMaa @DisneyPlusHSTel — Nagarjuna Akkineni (@iamnagarjuna) August 11, 2024 Also Read: Kanguva: అదిరిపోయే విజువల్స్, యాక్షన్ సీన్స్.. సూర్య కంగువా ట్రైలర్..! - Rtvlive.com #akkineni-nagarjuna #bigg-boss-8-promo మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి