Mass Re-Release: మాస్ అంటే దుమ్ము లేచిపోవాలి.. 'మాస్' రీ రిలీజ్ టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున- రాఘవ లారెన్స్ కాంబోలో వచ్చిన సూపర్ హిట్ మూవీ 'మాస్'. అప్పట్లో భారీ విజయాన్ని సాధించిన ఈ చిత్రం మరో సారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆగస్టు 29న నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీని రీ రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. By Archana 13 Aug 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Mass Re-Release: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తోంది. ఒకప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్స్ గా నిలిచిన చిత్రాలను మరో సారి రీ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ప్రేక్షకులు కూడా కొంత కాలం వెనక్కి వెళ్లి.. తమ అభిమాన హీరోలను మళ్ళీ తెర పై చూసేందుకు ఇష్టపడుతున్నారు. ఇటీవలే సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా 'మురారి' సినిమాను రీ రిలీజ్ చేయగా సూపర్ హిట్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఏకంగా థియేటర్స్ లోనే పెళ్లిళ్లు చేసుకుంటూ, పెళ్లి సీన్లు రిక్రియెట్ చేస్తూ రచ్చ చేశారు మహేష్ బాబు ఫ్యాన్స్. మాస్ అంటే దుమ్ము లేచిపోవాలి 🌪️💥#Mass4k returns on August 28th on the occasion of KING @iamnagarjuna's Birthday 🥳 Brace yourselves to experience our KING #AkkineniNagarjuna in his most electrifying mass avatar, on the big screen ❤️🔥#MassVasthunnadu 🔥#Mass4konAugust28th… pic.twitter.com/9PyPPH9sPL — Annapurna Studios (@AnnapurnaStdios) August 12, 2024 నాగార్జున మాస్ రీ రిలీజ్ ఇది ఇలా ఉంటే తాజాగా మరో స్టార్ హీరో సినిమా రీ రిలీజ్ కు సిద్ధమైంది. టాలీవుడ్ కింగ్ నాగార్జున 'మాస్' మూవీని.. ఆయన బర్త్ డే సందర్భంగా ఆగస్టు 28న రీ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను ఎక్స్ లో షేర్ చేశారు. దీంతో నాగార్జున ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. 20 ఏళ్ళ క్రితం విడుదలైన ఈ చిత్రం నాగార్జునకు భారీ విజయాన్ని అందించింది. రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జ్యోతిక, ఛార్మి, సునీల్, రఘువరన్, రాహుల్‌దేవ్ ప్రధాన పాత్రల్లో నటించారు. టాలీవుడ్ రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించారు. Also Read: Kanguva: అదిరిపోయే విజువల్స్, యాక్షన్ సీన్స్.. సూర్య కంగువా ట్రైలర్..! - Rtvlive.com #akkineni-nagarjuna #mass-re-release #mass-movie మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి