Mr Bachchan: భారీగా మిస్టర్ బచ్చన్ ప్రీ రిలీజ్ బిజినెస్..! ఎన్ని కోట్లో తెలుసా..?

రవితేజ మిస్టర్ బచ్చన్ ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డు స్థాయిలో జరిగింది. ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో 27 కోట్లు, వరల్డ్ వైడ్ గా 31 కోట్ల వ‌ర‌కు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

New Update
Mr Bachchan: భారీగా మిస్టర్ బచ్చన్ ప్రీ రిలీజ్ బిజినెస్..! ఎన్ని కోట్లో తెలుసా..?

Mr Bachchan: టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) - హరీష్ శంకర్ (Harish Shankar) కాంబోలో రాబోతున్న మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ మిస్టర్ బచ్చన్. భారీ ఊహాగానాలతో రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే విడుదలైన మూవీ ట్రైలర్, సాంగ్స్ సినిమా పై మంచి బజ్ క్రియేట్ చేశాయి.

భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్

అయితే సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా రికార్డు స్థాయిలో ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మిస్టర్ బచ్చన్ థియేట్రికల్ రైట్స్ నైజాం, ఆంధ్రా, సీడెడ్ ఆంధ్రా ఏరియాల్లో భారీ ధరకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. నైజాం, ఆంధ్రా ఏరియాల్లో 23 కోట్లకు, సీడెడ్ ఆంధ్రాలో నాలుగు కోట్లకు, ఓవ‌ర్‌సీస్‌లో రెండు కోట్లకు, క‌ర్నాట‌క‌, రాయ‌చూర్‌ మిగిలిన ప్రాంతాల్లో క‌లిపి మ‌రో రెండు కోట్లకు ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో 27 కోట్లు, వరల్డ్ వైడ్ గా 31 కోట్ల వ‌ర‌కు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. మొత్తంగా 32 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో ఈ మూవీ రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తోంది.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ కథానాయికగా నటించగా.. సీనియర్ నటుడు జగపతి బాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. మిక్కీ జె మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. రావణాసుర, టైగర్ నాగేశ్వర్ రావు, ఈగల్ వంటి బ్యాక్ టూ బ్యాక్ ప్లాప్స్ తర్వాత రాబోతున్న ఈ మూవీ పై ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు.

Also Read: Naga Chaitanya Engagement : 8.8.8 అర్థం ఏంటి..? నాగచైతన్య, శోభిత నిశ్చితార్థం

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Imanvi Esmail నేను పాకిస్థానీ కాదు.. ప్రభాస్ హీరోయిన్ సంచలన ప్రకటన

ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ పాకిస్థాన్ అమ్మాయని, ఆమెను బ్యాన్ చేయాలని వస్తున్న వార్తలపై ఆమె స్పందించారు. నా కుటుంబంలో ఎవరూ పాకిస్తానీ మిలిటరీతో సంబంధం కలిగిలేరు. నేను గర్వించదగ ఇండోఅమెరికన్. దయచేసి తప్పుడు ప్రచారాలు చేయడం ఆపేయండి అని పోస్ట్ పెట్టింది.

New Update
Actress Imanvi: ప్రభాస్ హీరోయిన్ గా మిలటరీ ఆఫీసర్ కూతురు..! ఎవరీ ఈ బ్యూటీ..?

Fauji Actress Imanvi:  పహాల్గమ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థానీ నటీనటులు మన సినిమాల్లో నటించడానికి, వాళ్ళను ప్రోత్సహించడానికి వీల్లేదని సోషల్ మీడియా పోస్టుల రూపంలో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. ఈ క్రమంలో ప్రభాస్ ' ఫౌజీ'  హీరోయిన్ ఇమాన్వీ పై తీవ్ర విమర్శలు వెలువెత్తాయి. ఆమె పాకిస్థానీ మూలాలు ఉన్న అమ్మాయని, అమెరికాలో సెటిల్ అయ్యేముందు ఆమె తండ్రి పాకిస్థాన్ ఆర్మీలో మేజర్ గా పనిచేశారని ఆరోపణలు వచ్చాయి. దీంతో  నెటిజన్లు సినిమా నుంచి ఆమెను బ్యాన్ చేయలాంటు పోస్టులు చేయడం మొదలు పెట్టారు.

నేను పాకిస్థానీ కాదు..  

ఈ నేపథ్యంలో తాజాగా నటి ఇమాన్వీ ఈ వివాదంపై స్పందించింది. తాను పాకిస్థానీ కాదంటూ స్పష్టం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేసింది. అలాగే ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తూ మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. 

ఇమాన్వీ పోస్ట్.. 

ఇమాన్వీ తన పోస్టులో ఇలా రాసుకొచ్చింది.. నా కుటుంబానికి సంబంధించి సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఈ పుకార్లను, అబద్దాలను  నేను పరిష్కరించాలనుకుంటున్నాను.  నా కుటుంబంలో ఎవరూ ఇప్పటివరకు పాకిస్థానీ మిలిటరీతో ఏ విధంగానూ సంబంధం కలిగిలేరు. ద్వేషాన్ని పుట్టించాలనే ఏకైక ఉద్దేశంతోనే ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. నేను లాస్ ఏంజిల్స్ లో పుట్టాను. నా తల్లిదండ్రులు చట్టబద్ధంగా అమెరికాకు యువతగా వలస వచ్చారు. ఆ తర్వాత అమెరికా పౌరులుగా మారారు.  నేను హిందీ, తెలుగు, గుజరాతీ,  ఇంగ్లీష్ మాట్లాడే గర్వించదగిన ఇండోఅమెరికన్  అంటూ క్లారిటీ ఇచ్చింది. కొన్ని పేరున్న వార్త సంస్థలు కూడా నా గురించి కనీస రీసర్చ్ చేయకుండా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నాయి అంటూ రాసుకొచ్చారు. 

ఇమాన్వీ అమెరికాలోని విశ్వవిద్యాలయంలో తన విద్యాబ్యాసాన్ని పూర్తి చేసినట్లు తెలిపింది. ఆ తర్వాత సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ గా, నటిగా, కొరియోగ్రాఫర్‌గా, పనిచేస్తూ కళల పట్ల తన ఇంట్రెస్ట్ కొనసాగించానని.. ఇప్పుడు భారతీయ చిత్రపరిశ్రమలో పనిచేసే అవకాశం దక్కినందుకు కృతజ్ఞతలు అని తెలిపింది. 

telugu-news | cinema-news | actress-imanvi | Prabhas Fauji | latest-news

Advertisment
Advertisment