Balu Gani Talkies: జై బాలయ్య.. ‘బాలు గాని టాకీస్’ ఫస్ట్ లుక్..!

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహా సమర్పణలో రాబోతున్న లేటెస్ట్ ప్రాజెక్ట్‌ ‘బాలు గాని టాకీస్’. తాజాగా ఈ మూవీ ఫ‌స్ట్ లుక్‌ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. విశ్వనాథన్ ప్రతాప్ దర్శక‌త్వం వహిస్తున్న ఈ చిత్రంలో శివ రామ చంద్రవరపు, శ‌ర‌ణ్య శ‌ర్మ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

New Update
Balu Gani Talkies: జై బాలయ్య.. ‘బాలు గాని టాకీస్’ ఫస్ట్ లుక్..!

Balu Gani Talkies: ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ 'ఆహా' (Aha) మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆహా సమర్పణలో రాబోతున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ ‘బాలు గాని టాకీస్’. చంద్రవరపు, శ‌ర‌ణ్య శ‌ర్మ హీరో, హీరోయిన్స్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి విశ్వనాథన్ ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నారు.

అతి త్వరలో, మీ అభిమాన 'బాలుగానీ టాకీస్' లో!
అందరూ జై బాలయ్య అంటూ రెడీ అయిపోండి!!#BaluGaniTalkies #AnAhaOrginialFilm @riseeastcre @kuncheraghu @SaranyaSharma_ pic.twitter.com/it7ylr8VMT

— ahavideoin (@ahavideoIN) July 22, 2024

Also Read: వైట్ బాడీకాన్ గౌనులో త్రిప్తి అందాల విధ్వంసం..! చూస్తే ఫిదా

‘బాలు గాని టాకీస్’ ఫస్ట్ లుక్

అయితే తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసింది ఆహా. ఈ పోస్టర్ చూస్తుంటే.. సినిమాలో హీరో బాలయ్యకు వీరాభిమాని అన్నట్లుగా తెలుస్తోంది. అలాగే హీరో పేరు బాలు అని, అతడికి ఒక సినిమా థియేటర్ ఉన్న‌ట్లుగా అర్థమవుతోంది. ఇక బాలయ్య వీరాభిమాని అయిన బాలు జీవితంలో ఎదురైన సంఘటనలు ఈ సినిమా కథగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆహా సమర్పణలో వచ్చిన కొత్త పోర‌డు, భామ క‌లాపం, క‌ల‌ర్ ఫొటో వంటి చిత్రాలు మంచి విజయాలను అందుకున్నాయి. ఇక ఇప్పుడు 'బాలుగాని టాకీస్' అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో రాబోతున్న ఈ మూవీ ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో చూడాలి. ఈ సినిమా త్వరలో ఆహాలో రానున్నట్లు తెలిపారు.

Also Read: Modern Masters : ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్.. రాజమౌళి డాక్యుమెంటరీ నెక్స్ట్ లెవెల్..!

Advertisment
Advertisment
తాజా కథనాలు