Brahmamudi Serial: కావ్య‌కు తన ప్రేమను చెప్పేసిన రాజ్.. అప్పుతో కళ్యాణ్ పెళ్లి..! రాజ్ షాకింగ్ నిర్ణయం

కావ్యతో కలిసి డిన్నర్ కు వెళ్లిన రాజ్ ఆమెతో తన ప్రేమను చెప్పాలని సర్ప్రైజ్ ప్లాన్ చేస్తాడు. మరో వైపు అప్పుకు పెళ్లి సంబంధం వచ్చినదని కావ్యకు ఫోన్ చేస్తుంది కనకం. ఇంతలో కళ్యాణ్ అప్పును ప్రేమిస్తున్నాడని తెలుసుకున్న రాజ్.. వారిద్దరిని ఒకటి చేయాలని అనుకుంటాడు.

New Update
Brahmamudi Serial: కావ్య‌కు తన ప్రేమను చెప్పేసిన రాజ్.. అప్పుతో కళ్యాణ్ పెళ్లి..! రాజ్ షాకింగ్ నిర్ణయం

Brahmamudi Serial: రాజ్ ఎలాగైనా కావ్యకు తన ప్రేమ గురించి చెప్పాలని సర్ప్రైజ్ ప్లాన్ చేస్తాడు. భార్య చేత కేక్ కట్ చేయించి ప్రేమ విషయాన్ని చెప్పాలని అనుకుంటాడు. ఈ సర్ప్రైజ్ ప్లాన్ అమలు చేయమని హోటల్ మేనేజర్ కు చెప్తాడు రాజ్. అనుకున్నట్లుగానే మేనేజర్ కేక్ తీసుకొని వస్తాడు కానీ పొరపాటున బ్యాక్ గ్రౌండ్ లో అన్నా చెల్లెల్లు మ్యూజిక్ ప్లే చేస్తాడు. దీంతో కావ్య బాగా నవ్వుకుంటుంది. ప్లాన్ అంతా పాడైందని రాజ్ ఇరిటేట్ అవుతాడు.

publive-image

ఆ తర్వాత రాజ్ కావ్య హోటల్ నుంచి బయలుదేరుతారు. ఇక వాళ్లిద్దరూ వస్తుండగా దారి మధ్యలో కారు ఆగిపోతుంది. దాంతో కావ్య రాక రాక మ‌నం బ‌య‌ట‌కు వ‌స్తే విధి కూడా వెక్కిరిస్తుంద‌ని, కాలం కూడా కామెడీ చేస్తుంద‌ని అని వెటకారంగా మాట్లాడుతుంది. ఇక రాజ్ తన ఫోన్ లో చార్జిన్ లేకపోవడంతో కావ్య ఫోన్ నుంచి క్యాబ్ బుక్ చేద్దామని అనుకుంటాడు. కానీ కావ్యతో ఫోన్ ఉండదు. ఇంతలో వర్షం స్టార్ట్ అవడంతో ఇప్పుడేం చేయాలి అని ఆలోచిస్తుంటాడు రాజ్.

publive-image

ఇంతలో రాజ్ కు దూరంగా ఒక పాత బిల్డింగ్ కనిపిస్తుంది. వెంటనే అక్కడికి వెళదామని కావ్యతో చెప్తాడు. ఇక రాజ్, కావ్య వర్షంలో తడుస్తూ ఆ బిల్డింగ్‌లోకి వెళ్తారు.

publive-image

బిల్డింగ్ లోప‌లికి వెళ్ల‌గానే రూమ్ అంతా క్యాండిల్స్ వెలిగించి ఉంటాయి. దాంతో కావ్య ఎవ‌రైన చేత‌బ‌డులు చేస్తున్నారా..? ఏంటి అని కామెడీ చేస్తుంది. దానికి రాజ్ అలాంటిది ఏమి లేదని చెప్తాడు. ఇక అక్కడే రాజ్ కు ఒక కొత్త చీర కనిపిస్తుంది. కావ్య తడిసిపోవడంతో ఆ చీర మార్చుకోమని చెప్తాడు. కానీ కావ్య ఒప్పుకోదు.. అది ఎవరిదో ఏంటో అని చెప్తుంది.

publive-image

ఇక రాజ్ బలవంత పెట్టడంతో ఆ కొత్త చీర కట్టుకుంటుంది కావ్య. ఆ చీరలో దేవ‌క‌న్య‌లా ముస్తాబైన తన భార్యను చూసి ఫిదా అవుతాడు రాజ్‌. ఆ తర్వాత రాజ్, కావ్య రాత్రంతా అక్కడే సరదాగా టైం స్పెండ్ చేస్తారు.

publive-image

మరో వైపు అపర్ణ, ఇందిరాదేవి డిన్నర్ కు వెళ్లిన రాజ్, కావ్య ఇంకా రాలేదేంటని కంగారు పడతారు. అపర్ణ ఒక సారి రాజ్ కు ఫోన్ చేస్తానని అంటుంది. దాంతో ఇందిరాదేవి.. వాళ్ళు సరదాగా బయటకు వెళ్లారు వస్తారులే డిస్టర్బ్ చేయకు అని చెప్తుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

publive-image

రేపటి ఎపిసోడ్ లో అప్పుకు పెళ్లి సంబంధం వచ్చిందని కావ్యకు ఫోన్ చేస్తుంది కనకం. మరో వైపు కళ్యాణ్ అప్పును ప్రేమిస్తున్నాడని తెలుసుకున్న రాజ్ వారిద్దరి ఒకటి చేయాలని అనుకుంటాడు.

Also Read: This Week Movies: ఈ వారం ఓటీటీ, థియేటర్స్ లో సినిమాల సందడి.. లిస్ట్ ఇదే..? - Rtvlive.com



Advertisment
Advertisment
తాజా కథనాలు