Kashmir : వేసవికాలం వస్తుంది కాశ్మీర్ వెళ్లండి!

వేసవిలో చల్లటి ప్రదేశాలకు వెళ్లాలి అనుకునే వారు,ఎత్తైన పర్వతశ్రేణులలో పర్యాటించాలనుకునే వారు కాశ్మీర్ కు వెళ్లండి.ఎందుకంటే అక్కడి ఆహ్లదకరమైన పర్వతాలు మిమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి.

New Update
Kashmir : వేసవికాలం వస్తుంది కాశ్మీర్ వెళ్లండి!

Go To Kashmir : వేసవి కాలం(Summer Season) లో చాలా మంది తమ కుటుంబ సభ్యులతో కలిసి టూర్లను ప్లాన్(Tours Plan) చేసుకుంటారు. వేసవిలో సందర్శించడానికి అత్యంత ఇష్టమైన ప్రదేశాలలో, పర్వతాలు  హిల్ స్టేషన్లు మొదటి స్థానంలో ఉంటాయి. అలాంటి పర్వతశ్రేణులు కాశ్మీర్ లో ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో, మీరు వేసవిలో కొండ లోయలను సందర్శించాలని ప్లాన్ చేసుకుంటే, మీకు గొప్ప అవకాశం ఉంది. భూమిపై స్వర్గం అని పిలవబడే కాశ్మీర్‌కు మిమ్మల్ని చాలా ఎయిర్ టూర్ ఏజన్సీస్ అందుబాటులో ఫ్యాకేజస్ అందిస్తున్నాయి.

శ్రీనగర్(Srinagar), గుల్మార్గ్, సోన్‌మార్గ్  పహల్గామ్‌లోని అందమైన లోయలు పర్యాటకులను ఎంతగానో అలరిస్తాయి. ఇక్కడ పర్వతశ్రేణులు మంచుతో కప్పబడి ఉంటాయి. మీరు టూర్ ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా ఇక్కడికి వెళ్లండి. ఎందుకంటే ఈ వేసవిలో మీరు కాశ్మీర్  చుట్టుప్రక్కల ప్రాంతాలు చల్లదనం తో పాటు ఎంతో ఆహ్లాదాన్ని అందిస్తాయి. ఈ టూర్ కు ఎంత ఖర్చు అవుతుందో మీ ప్రాంత టూర్ ఏజన్సీలను కన్సలట్ అయ్యి తెలుసుకోండి.

ఎంత డబ్బు ఖర్చు అవుతుంది?
మాకు తెలిసిన సమాచారం ప్రకారం ప్రయాణీకుడు ఎంచుకున్న ఆక్యుపెన్సీ  టూర్ తేదీ ప్రకారం టూర్ ప్యాకేజీ(Tour Package) కి టారిఫ్ ఉంటుంది. ప్యాకేజీ ఒక్కొక్కరికి రూ.50,700 నుండి ప్రారంభమవుతుంది. మీరు ఈ ప్యాకేజీ కింద ఒకే వ్యక్తి కోసం బుక్ చేసుకుంటే, మీరు రూ. 57,800 ఖర్చు చేయాల్సి ఉంటుంది. మీరు 2 వ్యక్తుల కోసం బుక్ చేసుకుంటే, మీరు ఒక్కొక్కరికి రూ. 52,300 ఖర్చు చేయాలి. 3 వ్యక్తుల కోసం బుకింగ్ చేస్తే, మీరు ఒక్కొక్కరికి రూ. 50,700 ఖర్చు చేయాలి.

Also Read : మండే ఎండలతో పెరుగుతున్న విద్యుత్‌ డిమాండ్‌!

Advertisment
Advertisment
తాజా కథనాలు