మూడవరోజు ఆటముగిసే సమయానికి ఆధిక్యంలో ఇంగ్లాండ్!

ఇంగ్లాండ్,వెస్టీండీస్ మధ్య జరగుతున్న రెండవ టెస్టులో మూడవ రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ జట్టు 207 పరుగుల ఆధిక్యం సాధించింది.మొదటి ఇన్నింగ్స్ లో 416 పరుగులు చేసి ఇంగ్లాండ్ ఆలౌటయ్యింది. తర్వాత బ్యాటింగ్ చేసిన వెస్టీండీస్ జట్టు 457 పరుగులు చేసి 10 వికెట్లు కోల్పొయింది.

New Update
మూడవరోజు ఆటముగిసే సమయానికి ఆధిక్యంలో ఇంగ్లాండ్!

ఇంగ్లండ్, వెస్టిండీస్ మధ్య నాటింగ్‌హామ్ వేదికగా రెండో టెస్టు జరుగుతుంది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులు చేసింది. రెండో రోజు ముగిసే సమయానికి వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 351/5 పరుగులు చేసింది. మూడో రోజు ఆటలో జాసన్ హోల్డర్ (27)ను వోక్స్ 'పేస్' అవుట్ చేశాడు. జాషువా డా సిల్వా హాఫ్ సెంచరీ కొట్టాడు. అతనికి షామర్ జోసెఫ్ సహకారంతో వెస్టిండీస్ ఆధిక్యంలో నిలిచింది. చివరి వికెట్‌కు 71 పరుగులు జోడించిన సమయంలో షమర్ (33)ను మార్క్ వుడ్ అవుట్ చేశాడు.

వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 457 పరుగులకు ఆలౌటైంది. జాషువా (82) నాటౌట్‌గా నిలిచాడు. ఇంగ్లండ్‌ తరఫున వోక్స్‌ 4 వికెట్లు పడగొట్టాడు.ఆపై 41 పరుగుల వెనుకబడి 2వ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టును జాక్ క్రాల్ (3) తో వెనుదిరిగాడు. పోప్ (51), డకెట్ (76) అర్ధశతకాలు దాటారు.టీ విరామం తర్వాత ఇంగ్లండ్ 2వ ఇన్నింగ్స్‌లో 248/3 పరుగులు చేసి 207 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. రూట్ (37), బ్రూక్ (71) నాటౌట్‌గా నిలిచారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు