Andhra Pradesh: ఏపీలో 2024 ఓటర్ల తుది జాబితా విడుదల చేసిన ఈసీ..

ఏపీలో 2024 ఓటర్ల తుది జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాష్ట్రంలో 4,08,07,256 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 2,00,09,275, మహిళలు 2,07,37,065 మంది ఉన్నారు. థర్డ్ జెండర్స్‌ 3,482, సర్వీస్ ఓటర్లు 67, 434 మంది ఉన్నారు.

New Update
Andhra Pradesh: ఏపీలో 2024 ఓటర్ల తుది జాబితా విడుదల చేసిన ఈసీ..

AP Voter List 2024: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంటు ఎన్నికలు కూడా దగ్గరికొస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం.. ఏపీలోని 2024 ఓటర్ల తుది జాబితాను జిల్లాల వారీగా విడుదల చేసింది. సీఈవో ఆంధ్ర (CEO Andhra) అనే వెబ్‌సైట్‌లో జిల్లాల వారీగా తుది ఓటర్ల జాబితాను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పింది. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వీటికి సంబంధించిన వివరాలను ఈ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు పేర్కొంది.

Also Read: ఈ నెల 24న ఏపీ బంద్‌.. జగన్ సర్కార్ పై విపక్షాల మండిపాటు

అలాగే ఈ జాబితాను ఎక్కడిక్కడే ప్రదర్శించాంటూ జిల్లా కలెక్టర్లకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 4,08,07,256 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 2,00,09,275 ఉండగా.. మహిళలు 2,07,37,065 మంది ఉన్నారు. ఇక థర్డ్ జెండర్స్‌ 3,482 మంది ఉన్నారు. అలాగే సర్వీస్ ఓటర్లు 67, 434 మంది ఉన్నారు.

ఇక ఎన్నికల సన్నద్ధపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) జవహర్ రెడ్డి సచివాలయంలో సమీక్ష జరిపారు. అధికారుల బదిలీల వివరాలు సమర్పించాలని ఈసీ ప్రభుత్వాన్ని ఆదేశించడంతో.. జనవరి 31 లోగా రాష్ట్రంలో ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బంది బదిలీలపై సమీక్ష నిర్వహించారు. అలాగే పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేయాల్సిన సౌకర్యాలు, సిబ్బంది ఖాళీలు ఇతర అంశాలపై సీఎస్‌ చర్చలు జరిపారు. ఈ సమావేశానికి ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా (Mukesh Kumar Meena), పోలీసు ఉన్నతాధికారులు, అదనపు సీఈఓలు హాజరయ్యారు.

Also Read: అయోధ్యలో బాలరాముడి దర్శన వేళలు ఇవే.. ఇలా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు

Advertisment
Advertisment
తాజా కథనాలు