Telangana: తెలంగాణ ఎన్నికల బరిలో TRS పార్టీ.. గుర్తు ఇదే..

తెలంగాణలో ఎన్నికల బరిలోకి మరో కొత్త పార్టీ వచ్చింది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 119 నియోజకవర్గాల్లోనూ బరిలో నిలుస్తామంటున్నారు ఆ పార్టీ అధ్యక్షుడు. తెలంగాణలో కొద్ది రోజుల కిందటే తెలంగాణ రాజ్య సమితి(TRS) పార్టీ పేరుతో కొత్త పార్టీ ఆవిర్భవించింది.

New Update
Telangana: తెలంగాణ ఎన్నికల బరిలో TRS పార్టీ.. గుర్తు ఇదే..

Telangana Rajya Samithi Party: తెలంగాణలో ఎన్నికల బరిలోకి మరో కొత్త పార్టీ వచ్చింది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 119 నియోజకవర్గాల్లోనూ బరిలో నిలుస్తామంటున్నారు ఆ పార్టీ అధ్యక్షుడు. తెలంగాణ(Telangana)లో కొద్ది రోజుల కిందటే తెలంగాణ రాజ్య సమితి(TRS) పార్టీ పేరుతో కొత్త పార్టీ ఆవిర్భవించింది. కొద్ది రోజులుగా స్తబ్ధుగా ఉన్న ఈ పార్టీ ఎన్నికల వేళ సై అంటూ దూసుకొచ్చింది. ఎన్నిక సంఘం ఈ టీఆర్ఎస్ పార్టీకి గ్యాస్ సిలిండర్ గుర్తును కేటాయించింది. 119 నియోజకవర్గాల్లోనూ ఒకే ఎన్నికల గుర్తును కేటాయించాలంటూ ఎన్నికల సంఘం ఆదేశించింది.

తుపాకుల బాలరంగం అధ్యక్షుడిగా ఉన్న టీఆర్ఎస్ పార్టీకి గుర్తింపు కోసం కొన్ని నెలల క్రితం కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నారు. ఆ క్రమంలో పార్టీకి గుర్తింపు లభించగా.. గుర్తు కేటాయించాలంటూ ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు పార్టీ అధ్యక్షుడు తుపాకుల బాలరంగం. ఈ ఈ లేకను పరిశీలించిన ఈసీ.. గ్యాస్ సిలిండర్ గుర్తునే కేటాయించింది. అంతేకాదు.. ఆ పార్టీ తరఫున బరిలో ఉండే అభ్యర్థులందరికీ గ్యాస్ సిలిండర్ గుర్తునే కేటాయించాలని ఆదేశించింది. అయితే, ఎన్నికల నిబంధనల ప్రకారం.. ఏదైనా పార్టీ కనీసం 5% సీట్లలో పోటీ చేయాల్సి ఉంటుంది. అలా చేయలేని పక్షంలో.. ఒకే గుర్తును కేటాయించాల్సిన అవసరం లేదు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. సదరు పార్టీ 5 శాతం స్థానాల్లో పోటీ చేయకపోతే.. సదరు పార్టీ పోటీ చేయని స్థానాల్లో ఆ గుర్తును ఇతరులకు కేటాయించవచ్చని స్పష్టం చేసింది ఈసీ.

ఇదికూడా చదవండి: విడాకులు తీసుకున్న కూతురికి ఘనంగా స్వాగతం తెలిపిన తండ్రి.. వీడియో వైరల్..

తెలంగాణ రాజ్య సమితి(టీఆర్ఎస్) పార్టీని సిద్ధిపేట జిల్లా పొన్నాల గ్రామానికి చెందిన తుపాకుల బాలరంగం అధ్యక్షుడిగా ఎన్నికల కమిషన్‌కు దరఖాస్తు చేసుకున్నారు. పార్టీ కార్యాలయంగా ఓల్డ్ అల్వాల్ (ఇం. నెం. 1-4-177/148, 149/201) చిరునామా నమోదు చేశారు. పార్టీ ఉపాధ్యక్షులుగా పొన్నాల గ్రామానికి చెందిన తుపాకుల మురళీకంఠ, ప్రధాన కార్యదర్శిగా సిద్దిపేట జిల్లా వెల్గటూర్ గ్రామానికి చెందిన నల్లా శ్రీకాంత్, కోశాధికారిగా పొన్నాల గ్రామానికి చెందిన సదుపల్లి రాజు ఉన్నారు.

ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు తలనొప్పి తప్పదా?

ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ.. ఒకప్పుడు టీఆర్ఎస్(తెలంగాణ రాష్ట్ర సమితి). అయితే, టీఆర్ఎస్ ఎప్పుడైతే బీఆర్ఎస్‌గా మారిందో.. అప్పుడే తెలంగాణ రాజ్య సమితి, తెలంగాణ రైతు సమితి పేరుతో టీఆర్ఎస్ అర్థం వచ్చేలా పార్టీల ప్రస్తావన రచ్చ చేసింది. చివరకు తెలంగాణ రాజ్య సమితి పేరుతో టీఆర్ఎస్ మీనింగ్ వచ్చేలా పార్టీనైతే ఏర్పాటు చేసి పర్మిషన్ కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ పంపించారు. అటు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో.. పోటీకి సిద్ధమైంది పార్టీ. అయితే, ఇప్పుడిదే బీఆర్ఎస్‌కు తలనొప్పిగా మారనుందని పొలిటికల్ వర్గాల్లో టాక్. ఇప్పటికే కారును పోలిన గుర్తులతో సతమతం అవుతున్న బీఆర్ఎస్‌కు.. ఇప్పుడు టీఆర్ఎస్ రూపంలో మరో టెన్షన్ మొదలైందని అంటున్నారు పొలిటికల్ పండితులు. పొలిటికల్ స్ట్రాటజీలో భాగంగానే.. బీఆర్ఎస్‌ను దెబ్బ కొట్టే లక్ష్యంతోనే ఈ పార్టీని పొలిటికల్ పోటీలోకి దింపుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ఎలక్షన్ స్టంట్స్ ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో చూడాలి.

ఇదికూడా చదవండి: దసరా పండుగకు ఊరెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. మరో 9 ప్రత్యేక రైళ్లు..

Advertisment
Advertisment
తాజా కథనాలు