Nara Bhuvaneshvari : నారా భువనేశ్వరికి ఈసీ నోటీసులు.. కారణం ఇదే..! నారా భువనేశ్వరికి ఈసీ నోటీసులు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘించి చెక్కులు పంపిణీ చేశారని వైసీపీ నేతలు ఫిర్యాదు చేయడంతో ఈ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసింది. By Jyoshna Sappogula 24 Mar 2024 in ఆంధ్రప్రదేశ్ తిరుపతి New Update షేర్ చేయండి Nara Bhuvaneshvari : టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu) భార్య నారా భువనేశ్వరి(Nara Bhuvaneshvari) కి ఎన్నికల అధికారులు షాక్ ఇచ్చారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ వైసీపీ నేతల ఫిర్యాదు ఆధారంగా నోటీసులు జారీ చేశారు. భువనేశ్వరి ఎన్నికల కోడ్(Election Code) అమల్లో ఉన్న సమయంలో చెక్కులు పంపిణీ చేశారని వైసీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ అంశంలో చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారులను కోరారు. Also Read : వివేకాను హత్య చేసి తప్పు చేశా.. ప్రాణాల మీద ఆశ వదిలేసుకున్నా.. దస్తగిరి సంచలనం! ఈ క్రమంలోనే నారా భువనేశ్వరికి ఈసీ నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనపై 24 గంటల్లోపు విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అన్నమయ్య జిల్లా(Annamayya District) కలెక్టర్‌ను ఆదేశించింది. ఇదిలా ఉండగా స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసు(Skill Development Scam Case) లో చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా ‘నిజం గెలవాలి’ పేరుతో ఆయన భార్య నారా భువనేశ్వరి అప్పట్లోనే పర్యటనలు చేపట్టారు. చంద్రబాబు అరెస్టుతో మనస్తాపం చెంది మరణించిన వారి కుటుంబాలకు ఆర్థిక సహయం చేస్తూ అండగా నిలబడుతున్నారు. #andhra-pradesh #tdp #nara-bhuvaneshvari మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి