Mobile: ఏంటి.. ఫోన్ కు అందమైన పౌచులు వెతికి మరీ వేస్తున్నారా..? అయితే ఫోన్ జాగ్రత్త..!

సాధారణంగా ఖరీదైన ఫోన్‌ను కొనుగోలు చేసిన వెంటనే దాని భద్రత కోసం మంచి పౌచ్ వేయడం చేస్తుంటారు. కానీ దీని కారణంగా ఫోన్ దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది. ఫోన్ పౌచ్ వల్ల కలిగే నష్టాలేంటో తెలుసుకోవడానికి హెడ్డింగ్ పై క్లిక్ చేయండి.

New Update
Mobile: ఏంటి.. ఫోన్ కు అందమైన పౌచులు వెతికి మరీ వేస్తున్నారా..? అయితే ఫోన్ జాగ్రత్త..!

Mobile: ప్రస్తుతం ప్రతీ ఒక్కరి చేతిలో మొబైల్ అనేది ఒక కామం వస్తువుగా మారిపోయింది. అంతే కాదు కొత్త కొత్త ఫీచర్స్ కోసం లక్షలు ఖరీదు చేసి ఫోన్‌ని కొనుగోలు చేసే వ్యక్తులు ఉంటారు. అయితే ఖరీదైన ఫోన్‌ను కొనుగోలు చేసిన తర్వాత, దాని భద్రత కూడా చాలా ముఖ్యం. చాలా మంది ఫోన్ కొన్న వెంటనే దాని భద్రత కోసం మంచి కవర్ లేదా పౌచ్ వెతకడం ప్రారంభిస్తారు. ఇది ఫోన్ పై గీతాలు పడకుండా, పగిలిపోకుండా కాపాడుతుంది.అయితే వాస్తవానికి, మొబైల్‌ను సురక్షితంగా ఉంచే ఫోన్ కవర్ లేదా పౌచ్ వల్ల నష్టాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా వేసవి కాలంలో ఫోన్ కవర్స్ మరింత నష్టాన్ని కలిగిస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాము

హ్యాంగ్ అవ్వడం

మొబైల్ కు పౌచ్ వేసినప్పుడు.. అది అన్ని వైపుల నుంచి మూసివేయబడుతుంది. అటువంటి పరిస్థితిలో, గాలి ప్రవాహం ఆగిపోతుంది. తద్వారా ఫోన్ త్వరగా వేడెక్కడం ప్రారంభమవుతుంది. దీని కారణంగా కొత్త మొబైల్‌లు కూడా హ్యాంగింగ్ సమస్యను ఎదుర్కోవడం ప్రారంభమవుతుంది. ఇది కాకుండా, కొన్ని ఫోన్‌లలో ఛార్జింగ్ సమస్య కూడా తలెత్తుతుంది. ఫోన్ వేడిగా ఉన్నప్పుడు, దాని ఛార్జింగ్ స్పీడ్ స్లో అవుతుంది.

publive-image

నెట్‌వర్క్‌లో సమస్య

మొబైల్‌పై మందపాటి పౌచ్ ను ఉంచడం వల్ల హ్యాంగ్ , హీటింగ్ సమస్య మాత్రమే కాకుండా, సెన్సార్‌ను కవర్ చేయడం వల్ల మీకు నెట్‌వర్క్ సమస్యలు కూడా తలెత్తుతాయి. అంతే కాకుండా ఫోన్ వేడెక్కడం వల్ల చెవి దగ్గర పట్టుకొని మాట్లాడలేకపోవడం, డేటా స్పీడ్ తగ్గడం తదితర సమస్యలు వస్తాయి.

బ్యాటరీ సమస్య

ఫోన్ వేడెక్కడం బ్యాటరీ సామర్థ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. క్రమంగా ఫోన్ బ్యాటరీ బలహీనంగా మారుతుంది. కవర్ నాణ్యతగా లేకుంటే, అన్ని రకాల బ్యాక్టీరియా అందులో పేరుకుపోయి, మీకు హాని కలిగించడమే కాకుండా, ఫోన్ సెన్సార్లను కూడా దెబ్బతీస్తుంది.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

Also Read:Milk Adulteration: కల్తీ పాలను గుర్తించడం ఎలా..? తాగారో ఆరోగ్యానికి ముప్పే..! - Rtvlive.com

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

SRH vs MI: కష్టాల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్.. 5 వికెట్లు ఢమాల్- స్కోర్ చూస్తే షాకే

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కష్టాల్లో పడింది. ముంబై ఇండియన్స్ బౌలర్ల దాటికి తట్టుకోలేక చేతులెత్తేసింది. 15 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. క్రీజులో క్లాసెన్ 51*, అభినవ్ 12* ఉన్నారు.

New Update
SRH vs MI NEW

ముంబై ఇండియన్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు చేతులెత్తేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన SRH జట్టు ప్రారంభం నుంచే తడబడింది. ఓపెనర్లుగా క్రీజ్‌లోకి వచ్చిన ట్రావిస్‌ హెడ్‌, అభిషేక్‌ శర్మ దూకుడుగా ఆడే క్రమంలో పెవిలియన్‌కు చేరారు. తొలి ఓవర్‌కు 2 పరుగులు చేసిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్ 2 ఓవర్లకు 1 వికెట్ కోల్పోయింది. ట్రెంట్‌ బౌల్ట్‌ బౌలింగ్‌లో ట్రావిస్ హెడ్‌ డకౌట్‌ అయ్యాడు. 

ఇది కూడా చూడండి: PM Modi: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ

SRH vs MI

వెను వెంటనే 2 ఓవర్1వ బంతికి సన్‌రైజర్స్ జట్టు రెండో వికెట్ కోల్పోయింది. ఇషాన్‌ కిషన్‌ (1) ఔట్‌అయ్యాడు. దీపక్‌ చాహర్‌ బౌలింగ్‌లో వికెట్‌ కీపర్‌ రికెల్‌టన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత ఓవర్‌లోనే మరో వికెట్ డౌన్ అయింది. 3 ఓవర్ 3వ బంతికి  అభిషేక్‌ శర్మ (8) ఔటయ్యాడు. ట్రెంట్‌ బౌల్ట్‌ బౌలింగ్‌లో క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఇలా 4 ఓవర్లకు 13/3 స్కోర్‌ చేసింది. 

వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. ఇక ఎవరూ ఊహించని రీతిలో నాలుగో వికెట్‌ను హైదరాబాద్ జట్టు కోల్పోయింది. 4 ఓవర్1వ బంతికి నితీశ్‌ కుమార్‌ రెడ్డి (2) ఔట్‌ అయ్యాడు. దీంతో 5 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 15 పరుగులు చేశారు. క్రీజులో అనికేత్‌ వర్మ, హెన్రిచ్‌ క్లాసెన్‌ మెల్లి మెల్లిగా పరుగులు రాబడుతూ వచ్చారు.

ఇది కూడా చూడండి: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

అదే సమయంలో మరో బిగ్ షాక్ తగిలింది. అనికేత్‌ వర్మ (12) ఔట్‌ అయ్యాడు. హార్దిక్‌ పాండ్య వేసిన 8 ఓవర్ 3వ బంతికి వికెట్‌ కీపర్‌ రికెల్‌టన్‌కు క్యాచ్‌ ఇచ్చి అనికేత్‌ వెనుదిరిగాడు. దీంతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 35 పరుగుల వద్ద 5వ వికెట్‌ కోల్పోయింది. ఇలా వరుస వికెట్ల నష్టంతో హైదరాబాద్ జట్టు కష్టాల్లో పడింది. స్టార్ బ్యాటర్లందరూ ఔటవడంతో కనీసం 100 పరుగులు అయినా చేస్తారా? అనే సందేహంలో ఫ్యాన్స్ ఉన్నారు. మొత్తంగా 15 ఓవర్లకు స్కోర్‌ 90/5 చేసింది. ప్రస్తుతం క్రీజులో క్లాసెన్‌ 45*, అభినవ్‌10* ఉన్నారు. 

IPL 2025 | srh-vs-mi | IPL 2025 SRH vs MI Live Score | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment