COFFEE: ఏంటీ కాఫీ ఎక్కువ తాగేస్తున్నారా..? అయితే జాగ్రత్త చాలా మంది కాఫీ ఎక్కువ తాగుతుంటారు. కానీ అతిగా తాగితే ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. అధిక కెఫిన్ కారణంగా ఆందోళన, నిద్రలేమి, కడుపులో ఇబ్బంది, అలసట, గుండె దడ సమస్యలకు కారణమవుతుంది. కాఫీ మితంగా తాగితేనే ఆరోగ్యానికి ప్రయోజనం. By Archana 18 Jan 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి COFFEE: చాలా మందికి కాఫీ లేనిదే డే స్టార్ట్ చేయడం కష్టంగా ఫీల్ అవుతారు. ఇక ఇప్పుడున్న బిజీ లైఫ్ లో వర్క్ మధ్యలో కాస్త రిలాక్స్ అవ్వడానికి కాఫీ తాగడం చాలా మందికి అలవాటు. కొంత మంది రోజులో మూడు కంటే కంటే ఎక్కువ సార్లు తాగే వాళ్ళు కూడా ఉంటారు. సాధారణంగా కాఫీ మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదేనని నిపుణుల సూచన. కాఫీ.. డిప్రెషన్, గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్, వంటి సమస్యలను నిరోధిస్తుంది. కానీ అతిగా తీసుకుంటే ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. అతిగా తీసుకుంటే కలిగే నష్టాలు ఏంటో తెలుసుకుందాము.. ఆందోళన సహజంగా కాఫీని మితంగా తీసుకుంటే ఆందోళను తగ్గించడంలో సహాయపడుతుంది. కానీ కావాల్సిన కంటే అతిగా తాగితే ఆందోళనను ప్రేరేపించి.. భయాందోళనకు గురి చేసే అవకాశం ఉంటుంది. ఒక కప్పు కాఫీలో 80-140 mg కెఫిన్ శాతం ఉంటుంది. 500mg కంటే ఎక్కువ తీసుకున్నపుడు ఆందోళన సమస్యను ప్రేరేపించే ప్రమాదం ఉంది. నిద్రలేమి కాఫీ మోతాదుకు మించి తాగినప్పుడు వీటిలోని కెఫిన్ కంటెంట్ నిద్రలేమి సమస్యకు కారణమవుతుంది. ఇది మానసిక ఆరోగ్యం పై కూడా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు కాఫీ అస్సలు తాగొద్దు. Also Read: Morning Tips : ఏంటీ రోజంతా బద్దకంగా ఉంటుందా..? అయితే మీరు ఇవి చేయాల్సిందే కడుపులో ఇబ్బంది సహజంగా కాఫీలోని ల్యాక్షేటివ్ గుణాలు మలబద్దకం సమస్య పై మంచి ప్రభావం చూపుతాయి. అలాగే దీనిలోని గ్యాస్ట్రిన్ హార్మోన్ పేగు కదలికలకు సహాయపడుతుంది. కానీ అతిగా తీసుకుంటే కడుపులో ఇబ్బంది (స్టమక్ అప్సెట్ ) కలిగిస్తుంది. గుండె దడ మోతాదుకు మించి కెఫిన్ డోస్ ఎక్కువైనప్పుడు గుండె వేగంగా కొట్టుకోవడం, గుండె దడకు కారణమవుతుంది. ఇది చికాకు, ఆందోళనను కలిగిస్తుంది. Also Read: Digestive Tips: జీర్ణ సమస్యలను చెక్ పెట్టడానికి ఈ టిప్స్ పాటించండి! #coffee #effects-of-drinking-coffee మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి