Education Loans: ఈ ఏడాది ఎడ్యుకేషన్ లోన్స్ లో భారీ పెరుగుదల.. ఎందుకంటే.. 

మన దేశంలో ఎడ్యుకేషన్ లోన్స్ భారీగా పెరిగాయి. కోవిడ్ సమయంలో 3.1% తగ్గిన ఎడ్యుకేషన్ లోన్స్ ఇప్పుడు భారీగా పెరిగాయి. 2023లో ఐదేళ్ల గరిష్ట స్థాయికి ఎడ్యుకేషన్ లోన్స్ చేరుకున్నాయి. ఈ ఏడాది ఒక్క ఏప్రిల్-అక్టోబర్ మధ్యకాలంలోనే 20.6% వృద్ధి ఎడ్యుకేషన్ లోన్స్ లో ఉంది. 

New Update
Education Loans: ఈ ఏడాది ఎడ్యుకేషన్ లోన్స్ లో భారీ పెరుగుదల.. ఎందుకంటే.. 

Education Loans: మన దేశంలో ఉన్నత విద్య కోసం ఎడ్యుకేషన్ లోన్స్ తీసుకునే ట్రెండ్ పెరిగింది. దీని కారణంగా ప్రతి సంవత్సరం ఎడ్యుకేషన్ లోన్స్ లో విపరీతమైన పెరుగుదల కనిపిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-అక్టోబరు మధ్య కాలంలో ఎడ్యుకేషన్ లోన్స్ మొత్తం 20.6% పెరిగి రూ.1,10,715 కోట్లకు చేరుకుంది. ఆర్‌బీఐ నివేదిక ప్రకారం ఈ పెరుగుదల గత ఐదేళ్లలో అత్యధికం. 2023 ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంలో 12.3% వృద్ధి మాత్రమే నమోదైంది. 2022 ఆర్థిక సంవత్సరంలో ఇది 3.1% ప్రతికూలంగా ఉంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, విద్యా రుణాల పెరుగుదల వెనుక అనేక కారణాలు ఉన్నాయి. అవేమిటో తెలుసుకుందాం.. 

ఈజీ లోన్.. 

నిపుణుల అభిప్రాయం ప్రకారం, గత కొన్నేళ్లుగా విదేశాలలో చదువుకునే క్రేజ్ పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది విదేశీ విద్య కోసం అప్పులు చేస్తున్నారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రుణాలు సులభంగా లభించడం వల్ల ఇది మరింత పెరిగింది. డేటా ప్రకారం, ఈసారి 65 శాతం ఎడ్యుకేషన్ లోన్స్(Education Loans) పంపిణీ అయ్యాయి. ఈ లోన్స్ సాధారణంగా రూ.40 నుంచి 60 లక్షల మధ్య ఉండే లోన్స్.

పెరుగుతున్న ఆఫ్‌లైన్ క్యాంపస్ కోర్సుల ట్రెండ్.. 

నిపుణుల అభిప్రాయం ప్రకారం, కోవిడ్ తర్వాత ఆఫ్‌లైన్ క్యాంపస్ కోర్సుల పునరుద్ధరణ ఎడ్యుకేషన్ లోన్స్(Education Loans) డిమాండ్ పెరగడానికి ప్రధాన కారణాలలో ఒకటి. కాలేజీలు మళ్లీ విద్యార్థులను ఆహ్వానించడం వల్ల ఎడ్యుకేషన్ లోన్స్  పెరుగుతున్నాయి.

Also Read: పైకెగసిన స్టాక్ మార్కెట్.. ఈ స్టాక్స్ దుమ్ములేపాయి 

ఎడ్యుకేషన్ లోన్స్ పై రాయితీ.. 

బ్యాంకులు-ఎన్‌బిఎఫ్‌సిలకు రిస్క్ వెయిట్‌లను పెంచడం ద్వారా కొన్ని రిటైల్ రంగాలకు రుణాలను కఠినతరం చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల తీసుకున్న చర్యలు విద్యా రుణాలలో(Education Loans) సడలింపులకు దారితీశాయి. దీని కారణంగా, రాబోయే నెలల్లో విద్యా రంగంలో లోన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది.

మొత్తంగా చూసుకుంటే ఎడ్యుకేషన్ లోన్స్ పెరగడం అనేది దేశంలో విద్యార్థులు ఉన్నత చదువులపై చూపెడుతున్న శ్రద్ధ పెరుగుతున్న  విషయాన్ని స్పష్టం చేస్తోంది. కోవిడ్ కారణంగా వెనుకబడిన చదువులు ఇప్పుడు గాడిన పడిన విషయాన్ని లోన్స్ పెరుగుదల సూచిస్తోంది. ఎడ్యుకేషన్ లోన్స్ లో ఎక్కువ భాగం విదేశీ విద్య కోసం కావడం.. మన విద్యార్థులలో విదేశీ విద్యపై ఉన్న ఆసక్తిని కూడా స్పష్టం చేస్తోందని చెప్పవచ్చు. 

Watch this interesting Video:

Advertisment
Advertisment
తాజా కథనాలు