నగల వ్యాపారిని లంచం అడిగిన ఈడీ అధికారి అరెస్ట్ చేసిన సీబీఐ!

లంచం కేసులో ఢిల్లీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ సందీప్ సింగ్ యాదవ్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. ముంబైలో ఈ నెల 3 వతేదీన ఓ నగల దుకాణంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు చేశారు. ఆ సమయంలో సందీప్ ఆ వ్యాపారిని రూ.25 లక్షలు లంచం అడిగిన కేసులో అతడిని సీబీఐ అరెస్ట్ చేసింది.

New Update
నగల వ్యాపారిని లంచం అడిగిన ఈడీ అధికారి అరెస్ట్ చేసిన సీబీఐ!

లంచం కేసులో ఢిల్లీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ సందీప్ సింగ్ యాదవ్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది.ఈ నెల 3, 4 తేదీల్లో ముంబైలోని ఓ ప్రముఖ నగల దుకాణంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు చేశారు. ఆ సమయంలో సందీప్ సింగ్  నగల వ్యాపారిని రూ.25 లక్షలు లంచం అడిగిన కేసులో అతడిని సీబీఐ అరెస్ట్ చేసింది.
ఆగస్టు 3, 4 తేదీల్లో ముంబైలోని ఓ ప్రముఖ నగల దుకాణంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు చేశారు. ఆ సమయంలో ఎన్ ఫోర్స్ మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ సందీప్ సింగ్ యాదవ్ నగల వ్యాపారిని రూ.25 లక్షలు లంచం అడిగాడు. డబ్బులు ఇవ్వకుంటే అరెస్ట్ చేస్తానని కూడా బెదిరించాడు.

సందీప్ సింగ్ యాదవ్ డిమాండ్ చేసిన మొత్తాన్ని నగల వ్యాపారి చెల్లించలేకపోయాడు. దీంతో రూ.20 లక్షలు చెల్లించేందుకు బేరం కుదుర్చుకున్నాడు. 20 లక్షలు లంచం తీసుకుంటుండగా సందీప్ సింగ్ యాదవ్ సీబీఐ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అతడిని అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు