Raviteja: సంక్రాంతి బరిలో నిలిచేందుకు రెడీ అవుతున్న ఈగల్‌!

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న చిత్రాల్లో ఈగల్ సినిమా ఒకటి. ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ కమ్‌ డైరెక్టర్‌ కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్‌ మెయిన్ లీడ్ రోజ్ లో నటిస్తోంది. కావ్య థాపర్‌ కీలక పాత్రలో నటిస్తోంది.

New Update
Raviteja: సంక్రాంతి బరిలో నిలిచేందుకు రెడీ అవుతున్న ఈగల్‌!

సంక్రాంతి వస్తుందంటే చాలు కోడి పందెలు, ఎడ్ల పందెలు కోసం చూసేవారు కొందరు ఉంటే..కొత్త సినిమాలు విడుదల అవుతున్నాయనే ఆశ కొందరిలో ఉంటుంది. ప్రతి సంవత్సరం సంక్రాంతి బరిలో పెద్ద హీరోల సినిమాలు ఉంటాయి. ఈ ఏడాది కూడా సంక్రాంతి బరిలో నిలిచిన చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు భారీ విజయాలు సాధించాయి.

ఈ క్రమంలోనే మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న చిత్రాల్లో ఈగల్ సినిమా ఒకటి. ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ కమ్‌ డైరెక్టర్‌ కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్‌ మెయిన్ లీడ్ రోజ్ లో నటిస్తోంది. కావ్య థాపర్‌ కీలక పాత్రలో నటిస్తోంది.

తాజాగా ఈ సినిమా నుంచి ఓ క్రేజీ అప్ డేట్‌ వచ్చింది. అది ఏంటంటే ఈగల్‌ చిత్రాన్ని 2024 జనవరి 13న పాన్‌ ఇండియాతో పాటు వరల్డ్ వైడ్‌ గా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన రవితేజ స్టిల్ గూస్‌ బంప్స్‌ తెప్పించేలా ఉంది. రవితేజ అంటేనే విధ్వంసానికి మారుపేరు.

ఆ విధ్వంసాన్ని తన అభిమానులకు చూపించాడానికి రవి మరోసారి రెడీ అయిపోయాడు. మొండోడు పండగ తీసుకుని పదమూడున వస్తున్నాడు.. అంటూ లాంఛ్ చేసిన లుక్ ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. ఈ సినిమాలో నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. Davzand సంగీతం అందిస్తున్నారు.

రవి ఈ సినిమాతో పాటు మరో పాన్ ఇండియా చిత్రం టైగర్ నాగేశ్వరరావులో కూడా నటిస్తున్నాడు. 1970 కాలంలో స్టూవర్ట్ పురంలో పేరు మోసిన దొంగ అయినటువంటి టైగర్ నాగేశ్వర రావు జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి వంశీ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ చిత్రంతో నుపుర్ సనన్‌ హీరోయిన్‌గా టాలీవుడ్ డెబ్యూ ఇస్తోంది. గాయత్రి భరద్వాజ్‌ మరో ఫీ మేల్ లీడ్‌ రోల్‌లో నటిస్తుండగా.. సీనియర్‌ నటి రేణూదేశాయ్‌ హేమలత లవణం పాత్రలో నటిస్తోంది. టైగర్ నాగేశ్వర రావు అక్టోబర్ 20న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు