రాష్ట్రం లోనే అత్యధిక దొంగ ఓట్లు కలిగిన నియోజకవర్గం చంద్రగిరిదే..! చంద్రగిరి నియోజకవర్గంలో 35వేల దొంగ ఓట్లను తాము గుర్తించామని ఆ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నాని సంచలన వ్యాఖ్యలు. మృతి చెందిన 5వేల మంది ఓటర్లను తొలగించకపోగా అదనంగా అడ్రస్ ట్రేస్ చేయలేని 20వేల వరకు దొంగ ఓట్లను కలిపారని మండిపడ్డారు. By Jyoshna Sappogula 09 Nov 2023 in ఆంధ్రప్రదేశ్ తిరుపతి New Update షేర్ చేయండి Chandragiri Constituency: చంద్రగిరి నియోజకవర్గంలో 35వేల దొంగ ఓట్లను తాము గుర్తించామని అన్నారు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని. గురువారం ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడుతూ.. దొంగ ఒట్లకు సంబంధించి వివరాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. స్ధానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన తనయుడు మోహిత్ రెడ్డిని గెలిపించుకోవడానికి దొంగ ఓట్లు తయారు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. Also Read: మంత్రి రోజా నోరు అదుపులో పెట్టుకోవాలి.. వార్నింగ్ ఇచ్చిన బీజేపీ లీడర్స్..! పోలింగ్ స్టేషన్ అధికారులతో కలిసి తాము గడపగడపకు వెళ్లి పరిశీలించగా మృతి చెందిన 5వేల మంది ఓటర్లను తొలగించకపోగా అదనంగా అడ్రస్ ట్రేస్ చేయలేని 20వేల వరకు దొంగ ఓట్లను కలిపారని అని తెలిపారు. రాష్ట్రం లోనే అత్యధిక దొంగ ఓట్లు కలిగిన నియోజకవర్గం చంద్రగిరేదేనని అన్నారు. గతంలో 388 బూతులు ఉండగా అదనంగా దొంగ ఓట్ల చేర్పుల కోసం ఏడు బూతులు పెంచారన్నారని ఆరోపించారు. చంద్రగిరి టౌన్ , తిరుపతి రూరల్ ప్రాంతాల పల్లెలు టిడిపి ఓటర్లు ఉన్న పల్లెలో వైసిపి దొంగ ఓట్లను కలిపి దీనికి సంబంధించిన జాబితాపై బి ఎల్ వో లు సంతకాలు చేశారన్నారు. Also read: ఆర్మీ జవాన్ పై పోలీసుల దాడి.. అనకాపల్లి జిల్లా ఎస్పీ సీరియస్ యాక్షన్..! నేడు వాటిని తొలగించమని ఏవిఆర్ఓ లను కోరితే వాళ్లు దాన్ని ఓటర్ లిస్టులో కంటిన్యూ చేస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రగిరి నియోజకవర్గంలో దాదాపు 35 వేల దొంగ ఓట్లపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గత ఆర్డిఓ దివ్య సముఖము దృష్టికి తీసుకెళ్లిన చంద్రగిరి ఎమ్మెల్యే కి భయపడి ఈ దొంగ ఓట్లను తొలగించ లేదని వ్యాఖ్యనించారు. జీరో డోర్ నెంబర్లతో ఫేక్ ఓట్లను సృష్టించారని సంబంధిత ఓటర్ల జాబితా లిస్టుల జిరాక్సులను హాజరైన విలేకరులకు అందజేశారు. ఓట్ల తప్పుడు లెక్కలు అందులో స్పష్టంగా ఉన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ తుడా సంస్థ అధికారులు టీం గా ఏర్పడి తుడా ధనాన్ని నియోజకవర్గంలో బెంచీలు ఏర్పాటు చేసి వృధా చేశారని.. అలాగే దొంగ ఓట్లను కలిపిన అధికారులకు శిక్ష తప్పదని హెచ్చరించారు. ఈ స్కాంలను బయట పెట్టడానికి తాము వెనకాడమని చివరికి జైలుకెళ్లడానికి కూడా సిద్ధంగా ఉన్నామని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి గెలుపు పై ధీమా వ్యక్తం చేశారు. #tirupati #duplicate-votes-in-ap మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి