/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/DSC-jpg.webp)
TS DSC Classes in T SAT: డీఎస్సీ పోటీ పరీక్షల పై స్పెషల్ తరగతులను నిర్వహించనున్నట్లు టీ -శాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. టీ శాట్ ఛానెల్ లో వివిధ సబ్జెక్టుల పై ఈ నెల 18 నుంచి తొమ్మిది రోజుల పాటు ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు కూడా ప్రత్యక్ష ప్రసారాలుంటాయని ఆయన వెల్లడించారు.
🔴LIVE Orientation Programs on DSC Recruitment
✅️ అంశం: ఇంగ్లీష్
✅️ అతిథి: శ్రీనివాస్ వకుళాభరణం
✅️ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం: ఏప్రిల్ 18 గురువారం ఉదయం 11 గంటలకు టి-సాట్ నిపుణలో#DSCtelangana #EducationTSAT pic.twitter.com/jrmbm9nqWE— T-SAT Network (@TSATnetwork) April 18, 2024
ఈ తరగతుల్లో గణితం, సైన్స్, బయాలజీ, కెమిస్ట్రీ, ఇంగ్లిష్ సబ్జెక్టులపై ప్రసారమయ్యే లైవ్ ప్రోగ్రామ్స్ మరుసటి రోజు విద్య ఛానల్‌లో సాయంత్రం 6 గంటలకు పునః ప్రసారం అవుతాయని తెలిపారు. డీఎస్సీ పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులు ఫోన్‌కాల్ ద్వారా చర్చలో పాల్గొని, తమ అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చని వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం జులైలో డీఎస్సీ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
✒️ పత్రిక ప్రకటన 17.04.2024
🔴డీఎస్సీ పోటీ పరీక్షపై టి-సాట్ స్పెషల్ లైవ్ ప్రొగ్రామ్స్
-సీఈవో వేణుగోపాల్ రెడ్డి, టి-సాట్,సాఫ్ట్ నెట్ pic.twitter.com/MjlYxpAGQv— T-SAT Network (@TSATnetwork) April 17, 2024
Also read: పిల్లల నెస్లే ప్రొడక్ట్స్ లో కల్తీ.. షాకింగ్ నివేదిక!