TS TET: టీచర్ ఉద్యోగార్థులకు అలర్ట్.. టెట్ నోటిఫికేషన్ పై కీలక అప్డేట్..!! తెలంగాణలో నిరుద్యోగులకు తీపికబురు చెప్పేందుకు సిద్ధమైంది సర్కార్. వారంలోనే మెగా డీఎస్సీతోపాటు , టెట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసేందుకు సర్కార్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. By Bhoomi 20 Feb 2024 in జాబ్స్ తెలంగాణ New Update షేర్ చేయండి TS TET Notification Latest News: తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త చేప్పేందుకు సిద్ధమైంది ప్రభుత్వం. వారం రోజుల్లో మెగా డీఎస్సీతో పాటు (Mega DSC), టెట్ (TET) నోటిఫికేషన్ కూడా జారీ చేసేందుకు సర్కార్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే వారంలో ఈ ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో మెగా డీఎస్సీని నిర్వహిస్తామని సర్కార్ ఇంతకు ముందే ప్రకటించిన సంగతి తెలిసిందే. గత సర్కార్ 5,089 టీచర్ పోస్టుల (Teacher Posts) భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేయగా.. అభ్యర్థులు దరఖాస్తులు కూడా చేసుకున్నారు. అయితే మరిన్ని పోస్టులను జత చేసి మెగా డీఎస్సీ నిర్వహిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. దానిలో భాగంగానే మరో 6వేల ఖాళీలను గుర్తించినట్లు తెలిసింది. గతంలో ప్రకటించిన పోస్టులతో పాటు కొత్తగా గుర్తించిన పోస్టుల భర్తీ కోసం త్వరలోనే ప్రభుత్వం మెగా డీఎస్సీని ప్రకటించే అవకాశం ఉంది. ఇందులో భాగంగా గత నోటిఫికేషన్ కు అనుబంధంగా మరో నోటిఫికేషన్ జారీ చేస్తారని సమాచారం. ఈ విషయంపై సోమవారం అధికారులు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఇప్పటివరకు టెట్ పాస్ కాని వారి కోసం మరో ఛాన్స్ ఇవ్వాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఉపాధ్యాయుల పదోన్నతులకు సమస్యను కూడా టెట్ నోటిఫికేషన్ ద్వారా కొంత వరకు పరిష్కరించవచ్చని భావిస్తున్నారు. ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలంటే టెట్ ఉత్తీర్ణత ఉండాలన్న నిబంధన కూడా ఉంది. చాలామందికి టెట్ లేదు. దాంతో టెట్ నోటిఫికేషన్ జారీ చేస్తే... అభ్యర్థులతో పాటు, ఉపాధ్యాయులకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు. అటు సీటెట్ ఫలితాలు సోమవారం విడుదలైన సంగతి తెలసిందే. జనవరి 21న ఈ పరీక్షను నిర్వహించారు. అభ్యర్థులు సాధించిన మార్కులు, క్వాలిఫై సర్టిఫికెట్స్ వెబ్ సైట్లో అందుబాటులో ఉంచారు. ఇది కూడా చదవండి: మేడారం స్పెషల్.. విద్యార్థులకు 5 రోజులు సెలవులు.. డేట్స్ ఇవే…!! #tet #dsc #ts-tet-notification మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి