డ్రైవర్లు లేని కార్లు ఎప్పటికీ రావు..నితిన్ గడ్కరీ! భారత్ లో డ్రైవర్స్ లేని కార్లు రావటం ఎప్పటకీ జరగదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.అదే జరిగితే డ్రైవర్‌ల భవిష్యత్ పై ప్రభావం చూపుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.టెస్లా ఎలక్ట్రికల్ కార్లను భారత్ లో అనుమతిస్తున్నప్పటికీ చైనాలో తయారీ సరైనది కాదని ఆయన అన్నారు. By Durga Rao 09 Jul 2024 in Latest News In Telugu రాజకీయాలు New Update షేర్ చేయండి IIM నాగ్‌పూర్ లో నిర్వహిస్తున్న జీరో మైల్ సంవాద్ కార్యక్రమంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యలను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ వివరించారు.ఆటోమొబైల్ ఇంజినీరింగ్‌లో కార్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను చేర్చడం, ఎలక్ట్రిక్ మోటార్స్ చట్టం ద్వారా జరిమానాలను పెంచడం లాంటి విషయాలను తెలిపారు. మేము ఎలక్ట్రిక్ మోటార్స్ చట్టం ద్వారా జరిమానాలను పెంచాము.వాటిపై ప్రజల్లో అవగాహన కూడా పెంచుతామని నితిన్ గడ్కరీ తెలిపారు. అయితే, భారత్ లో డ్రైవర్స్ లేని కార్లు రావటం ఎప్పటకీ జరగదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.అదే జరిగితే డ్రైవర్‌ల భవిష్యత్ పై ప్రభావం చూపుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ లో టెస్లాను స్వాగతిస్తున్నప్పటికీ, విక్రయాల కోసం చైనాలో తయారీ విధానం సరైనది కాదని కూడా ఆయన పేర్కొన్నాడు.అలా చేస్తే భారత్ లో విక్రయాలు జరగవని గడ్కరీ వెల్లడించారు. #nitin-gadkari మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి