BRAOU Admissions: అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ కోర్సులకు దరఖాస్తులు! డా.బి.ఆర్. అంబేడ్కర్ యూనివర్సిటీ 2024-25 విద్యా సంవత్సరానికిగానూ డిగ్రీ, పీజీ, పలు డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానించింది. ఆసక్తిగల అభ్యర్థులు 2024 ఆగస్టు 18 వరకు దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. https://www.braouonline.in/ By srinivas 28 Jul 2024 in జాబ్స్ తెలంగాణ New Update షేర్ చేయండి Hyderabad: హైదరాబాద్‌లోని డా.బి.ఆర్. అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఓపెన్ డిగ్రీ, పీజీ కోర్సుల ప్రవేశాలకు సంబంధించినోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ(బీఏ/బీకాం/బీఎస్సీ), పీజీ(ఎంఏ/ ఎంకాం/ఎమ్మెస్సీ) పలు డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో 2024-25 విద్యాసంవత్సరం ప్రవేశాలు చేపట్టనున్నట్లు అధికారిక ప్రకటన రిలీజ్ చేసింది. 2024 ఆగస్టు 18 వరకూ దరఖాస్తులు.. ఈ మేరకు ఆసక్తిగల అభ్యర్థులు 2024 ఆగస్టు 18 వరకూ దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. అలాగే యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ రెండు, మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ట్యూషన్ ఫీజు చెల్లించాలని కోరింది. డిగ్రీ, పీజీలో 2015-16 నుంచి 2023-24 వరకు అడ్మిషన్ పొంది ఫీజు సకాలంలో చెల్లించనివారు ఆగస్టు 18వ తేదీలోపు ట్యూషన్ ఫీజు చెల్లించాలని తెలిపింది. మరిన్ని వివరాలకోసం వర్సిటీ సహాయక కేంద్ర నంబర్లు 7382929570/580, 040-23680290/291/294/295, 55, 18005990101లను సంప్రదించాలని విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ ఎల్‌వీకే రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. అధికారిక వెబ్ సైట్ www.braouonline.in, www.braou.ac.in ఇది కూడా చదవండి: Rythu Bharosa: రైతు భరోసాపై మంత్రి భట్టి విక్రమార్క కీలక ప్రకటన! #pg #degree #dr-b-r-ambedkar-university #diploma-admission మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి