Tollywood : నటుడు పృథ్వీ పై వరకట్న వేధింపుల కేసు కొట్టివేత! సినీ నటుడు పృథ్వీరాజ్ పై నమోదై వరకట్న వేధింపుల కేసును కొట్టివేస్తున్నట్లు విజయవాడ కోర్టు తీర్పునిచ్చింది.అదనపు కట్నం కోసం తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారని పృథ్వీ భార్య శ్రీలక్ష్మి ఫిర్యాదు తో 2016 లో సెక్షన్ 498 ఏ కింద వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు. By Bhavana 27 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి Cine Actor Prudhvi Dowry Harassment Case Dismissed : సినీ నటుడు పృథ్వీరాజ్ (Prudhvi Raj) పై నమోదై వరకట్న (Dowry) వేధింపుల కేసును కొట్టివేస్తున్నట్లు విజయవాడ కోర్టు (Vijayawada Court) తీర్పునిచ్చింది. అదనపు కట్నం కోసం తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారని పృథ్వీ భార్య శ్రీలక్ష్మి ఫిర్యాదు తో నగరంలోని సూర్యారావు పేట స్టేషన్ లో 2016 లో సెక్షన్ 498 ఏ కింద వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు. పెళ్లి సమయంలో డబ్బు, బంగారు నటలు ఇచ్చినప్పటికీ కూడా ఇంకా అదనపు కట్నం తీసుకురావాలని నిత్యం వేధించేవారని శ్రీ లక్ష్మి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ తరువాత సినిమాల మీద మోజుతో తనను, కుటుంబాన్ని పట్టించుకోకపోవడంతో పాటు...వ్యసనాలకు బానిసై అదనపు డబ్బులు కోసం వేధిస్తున్నరాని ఆమె కోర్టుకు తెలిపింది. 2017లో పృథ్వీ పై ఛార్జీషీట్ దాఖలు చేశారు. దీని పై అప్పటి నుంచి వాదనలు జరుగుతున్నాయి. ఈ కేసు తుది తీర్పును న్యాయాధికారి బుధవారం తెలిపారు. నటుడు పృథ్వీ పై ఎలాంటి నేరారోపణలు రుజువు కాకపోవడంతో కేసును కొట్టేస్తూ, న్యాయాధికారి తీర్పుని ఇచ్చారు. Also read: తెలంగాణలో ఈ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు! #tollywood #actor-prudhvi-raj #actor-prudhvi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి