Suriya : సూర్య ఫ్యాన్స్ కి ఆరోజు డబుల్ ట్రీట్ ఉండబోతుందా? జూలై 23 సూర్య బర్త్ డే సందర్భంగా 'కంగువ' మూవీ నుంచి సర్ప్రైజింగ్ అప్డేట్ ఇవ్వనున్నట్టు తెలిసింది. ఆ రోజు సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారట మేకర్స్. అలాగే సూర్య 44 మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్ కూడా అదే రోజు ఉండబోతుందట. By Anil Kumar 06 Jun 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి Double Treat For Suriya Fans : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మూవీ కంగువా. తమిళ మాస్ డైరెక్టర్ శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ తో రూపొందుతుంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన సూర్య లుక్, టీజర్ సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలు పెంచేశాయి. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇటీవలే షూటింగ్ ముగించుకుంది. సూర్య ఐదు విభిన్న తరహా పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ తో పాటూ సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే సూర్య బర్త్ డే కానుకగా ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్ ఉండబోతున్నట్లు తాజా సమాచారం. Also Read : అనుపమకి అలాంటి మసాజ్ కావాలంట.. ఫోటో షేర్ చేసిన ‘టిల్లు స్క్వేర్’ బ్యూటీ! ఆ రోజు ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్... జూలై 23 సూర్య బర్త్ డే సందర్భంగా 'కంగువ' మూవీ నుంచి సర్ప్రైజింగ్ అప్డేట్ ఇవ్వనున్నట్టు తెలిసింది. ఆ రోజు సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారట మేకర్స్. అలాగే సూర్య 44 మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్ కూడా అదే రోజు ఉండబోతుందట. కోలీవుడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్క్షన్లో సూర్య తన 44 వ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. పూజా హెగ్డే హీరోయిన్ గా నాటొస్తున్న ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాతికి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. #kanguva-movie #suriya-birthday #suriya-44 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి