BREAKING: జగన్‌కు డబుల్ షాక్.. నేడు వైసీపీకి ఇద్దరు ఎంపీలు రాజీనామా!

AP: వైసీపీ చీఫ్ జగన్‌కు డబుల్ షాక్ తగిలింది. ఈరోజు వైసీపీకి ఇద్దరు ఎంపీలు మోపిదేవి, బీద మస్తాన్‌రావు రాజీనామా చేయనున్నారు. ఢిల్లీలో రాజ్యసభ ఛైర్మన్‌ను కలిసి రాజీనామా లేఖను అందించనున్నారు. వచ్చే నెల 5 లేదా 6న లోకేష్ సమక్షంలో టీడీపీలో వారు చేరనున్నట్లు సమాచారం.

New Update
BREAKING: జగన్‌కు డబుల్ షాక్.. నేడు వైసీపీకి ఇద్దరు ఎంపీలు రాజీనామా!

YCP MP's Resign: ఎన్నికల్లో ఓటమితో సతమతమవుతున్న వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కు ఇప్పుడు నేతల రాజీనామాల టెన్షన్ మొదలైంది. అసెంబ్లీ ఎన్నికలో 175 స్థానాల్లో పోటీ చేస్తే కేవలం 11 స్థానాలకు పరిమితమై ఘోర ఓటమిని చవి చూసిన వైసీపీ నుంచి కొందరు నేతలు బయటకు వస్తున్నారు. ప్రస్తుతం అధికారంలో ఎన్డీయేలోని జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీల్లో చేరుతున్నారు. ఏది ఏమైనా జగన్ కు పార్టీ నేతలను కాపాడుకోవడం పెద్ద సమస్యగా మారిందని ఆ పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

నేడు ఇద్దరు ఎంపీలు రాజీనామా!...

ఓటమి చెందిన నేతలే కాదు.. సిట్టింగ్ లో ఉన్న నేతలు కూడా రాజీనామా బాట పట్టారు. తాజాగా మరో ఇద్దరు నేతలు వైసీపీకి రాజీనామా చేయనున్నారు. ఇవాళ పదవికి, పార్టీకి రాజీనామా ఇద్దరు ఎంపీలు రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. ఎంపీలు మోపిదేవి, బీద మస్తాన్‌రావు రాజ్యసభ ఛైర్మన్ అపాయింట్‌మెంట్ తీసుకున్నారు. తమ రాజీనామా లేఖలను అందించనున్నారు. ఒకేసారి పదవికి, పార్టీకి ఎంపీల రాజీనామా చేయనున్నారు. ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు మోపిదేవి, బీదా మస్తాన్‌రావు. వచ్చే నెల 5,6 తేదీల్లో మంత్రి లోకేష్‌ సమక్షంలో టీడీపీలో చేరనున్నారు మోపిదేవి.

Advertisment
Advertisment
తాజా కథనాలు