Doube Ismart : 'డబుల్ ఇస్మార్ట్' సెకండ్ సింగిల్.. మరో మాస్ నంబర్ లోడింగ్..!

'డబుల్ ఇస్మార్ట్' నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా ఇందుకు సంబంధించి మేకర్స్ అప్డేట్ కూడా ఇచ్చారు. 'మార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముంత చోడ్ చింత' అంటూ సాగే ఈ పాటను జులై 16న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రామ్ లుక్ ఆకట్టుకుంది.

New Update
Doube Ismart : 'డబుల్ ఇస్మార్ట్' సెకండ్ సింగిల్.. మరో మాస్ నంబర్ లోడింగ్..!

Double Ismart Second Single Update : ఉస్తాద్ హీరో రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'డబుల్ ఇస్మార్ట్'. పక్కా మాస్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్ కు మంచి రెస్పాన్స్ రాగా.. రీసెంట్ గానే మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తూ ఫస్ట్ సింగిల్ వదిలారు. 'స్టెప్పమార్' అంటూ సాగే ఈ పాటలో రామ్ మాస్ స్టెప్స్ తో రామ్ దుమ్ములేపాడు.

దీంతోఈ సాంగ్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా ఇందుకు సంబంధించి అప్డేట్ కూడా ఇచ్చారు. 'మార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముంత చోడ్ చింత' అంటూ సాగే ఈ పాటను జులై 16న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రామ్ లుక్ ఆకట్టుకుంది. ఇందులో రామ్ రెండు చేతుల్లో రెండు బాటిల్స్ పట్టుకొని మందు తాగుతూ కనిపించాడు.

Also Read : ‘పవర్’ కాంబో రిపీట్.. రవితేజతో బాబీ, ముచ్చటగా మూడోసారి..!

పోస్టర్ చూస్తుంటే ఈ సాంగ్ పార్టీ మోడ్ లో ఉండబోతున్నట్టు అర్థమవుతుంది. ఈ పోస్టర్ కాస్త సెకండ్ సింగిల్ పై అంచనాలు పెంచేసింది. పూరీ కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో యంగ్ బ్యూటీ కావ్య థాపర్ కథానాయికగా నటించగా.. సంజయ్ దత్, బన్ని జె, అలీ, గెటప్ శ్రీను, సాయాజీ షిండే, మకరంద్ దేశ్‌పాండే, టెంపర్ వంశీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు