Sri Rama Navami : శ్రీరామ నవమి నాడు ఈ పనులు చేశారంటే... కోరి కష్టాలు తెచ్చుకున్నట్లే!

శ్రీరామ నవమి రోజున చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారాన్ని ముట్టుకోకూడదు. అలాగే జుట్టు కూడా కత్తిరించుకోకూడదు. ఇలా చేయడం వల్ల అశుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.

New Update
Sri Rama Navami : శ్రీరామ నవమి నాడు ఈ పనులు చేశారంటే... కోరి కష్టాలు తెచ్చుకున్నట్లే!

Jai Sri Ram : భక్తులంతా ఎంతో భక్తి శ్రద్దలతో శ్రీరామ నవమి(Sri Rama Navami) పండుగను జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా శ్రీరామ నవమిని ఘనంగా నిర్వహించేందుకు భక్తులు(Devotes) ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ పర్వదినాన కొన్ని చేయకూడని, చేయాల్సిన పనులు ఉన్నాయి. ముఖ్యంగా ఈ పర్వదినం రోజున ఉపవాసం(Fasting) ఉండే వారు కొన్ని తప్పక పాటించాల్సిన నియమాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం..

నవమి నాడు చేయాల్సిన పనులు:

శ్రీరామ నవమి రోజున ప్రతి ఒక్కరూ కూడా సూర్యోదయానికి ముందు గానే నిద్ర లేచి తలస్నానం చేయాలి. ఇంటిని పూల దండలు, పచ్చని తోరణాలతో అలంకరించుకోవాలి. నూతన వస్త్రాలు ధరించాలి. ఆ తరువాత సీతాలక్ష్మణ హనుమంత సమేతంగా ఉన్న రాముల వారి విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించాలి. పూజ సమయంలో శ్రీరాముడిని అష్టోత్తర శతనామావళి జపిస్తూ పూజ చేయాలి.

శ్రీరాముల వారికి ఎంతో వడపప్పు, పానకాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఈ పవిత్ర రోజున ఉపవాసం చేయడం వల్ల విష్ణులోక ప్రాప్తి కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. అంతేకాకుండా ఈరోజంతా రామ నామస్మరణం చేయడం, రామకోటి వంటివి రాయడం వల్ల అత్యంత పుణ్యం కలుగుతుందని భక్తులు నమ్ముతారు.

రోజంతా ఉపవాసం ఉండే వారు శరీరంలోని నీటి శాతం తగ్గకుండా మంచినీళ్లు, కొబ్బరి నీరు(Coconut Water), పండ్ల రసాలు(Fruit Juice) వంటి పానీయాలను సేవించవచ్చు. అంతేకాకుండా.. పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని కొన్ని తాజా పండ్లను, కూరగాయలను, నట్స్‌, పాల ఉత్పత్తులను ఆహారంలో భాగం చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

శ్రీరామ నవమి నాడు చేయకూడని పనులు:

ఎంతో ప్రత్యేకమైన ఈరోజున చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. ఈరోజున మాంసాహారాన్ని అస్సలు ముట్టుకోకూడదు. అంతేకాకుండా చాలా మంది సెలవు కదా అని జుట్టు కత్తిరించుకుంటు ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈరోజున మాత్రం అలా చేయకూడదు. ఇలా చేయడం వల్ల అశుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.

అంతేకాకుండా ఈరోజున ఎంతో సౌమ్యంగా ఉండాలి.. ఎవరితోనూ గొడవలు పడకూడదు, అబద్దాలు ఆడకూడదని పండితులు వివరిస్తున్నారు. అంతేకాకుండా ఈరోజున తినే ఆహారంలో అల్లం, వెల్లుల్లిని కూడా వాడకుండా ఉండడం మంచిది. అంతే కాకుండా ఉపవాసం ఉన్న వారు దానిని విరమించిన తరువాత ఎక్కువ ఉప్పు, కారం ఉన్న ఆహార పదార్థాలను తీసుకోకుండా ఉండాలి. ఉపవాసం తరువాత ఒకేసారి ఉప్పుకారాలు తీసుకుంటే అవి జీర్ణ వ్యవస్థ మీద ప్రభావం చూపే అవకాశాలుంటాయి. అందుకే ఉపవాసం తరువాత ఎక్కువ ఉప్పు కారాలు తీసుకోకూడదు.

Also read: డయాబెటిస్‌ ఉన్న వారు నేరెడు పండ్లను ఇలా వాడాలి… ఆకుల నుంచి గింజల వరకు ప్రతి ఒక్కటి !

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pooja Hegde: ‘రెట్రో’ మూవీపై బుట్టబొమ్మ వైరల్ పోస్ట్..

సూర్య, పూజా హెగ్డే జంటగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రెట్రో’ మూవీ మే 1న తమిళ, తెలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది. అయితే తాజాగా పూజ ఈ మూవీకి డబ్బింగ్ ప్రారంభించినట్లు తెలిపిన పోస్టు వైరల్ అవుతూ సినిమాపై హైప్ పెంచేసింది.

New Update
Retro Movie Pooja Hegde

Retro Movie Pooja Hegde

Pooja Hegde: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Surya) నటిస్తున్న లేటెస్ట్ మాస్ అండ్ క్లాస్ ఎంటర్‌టైనర్ ‘రెట్రో’(Retro) ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ యాక్షన్ డ్రామాను ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు తెరకెక్కిస్తున్నారు. 1980ల కాలాన్ని బ్యాక్‌డ్రాప్‌గా చేసుకొని రూపొందుతున్న ఈ చిత్రంలో గ్లామరస్ బ్యూటీ పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది.

Also Read: ఇకపై అంతా చీకట్లోనే.. షాకిచ్చిన్న నేషనల్ క్రష్..

మే 1న 'రెట్రో' గ్రాండ్ రిలీజ్

ఈ సినిమాను స్టోన్ బెంచ్ ఫిలిమ్స్, 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై జ్యోతిక, సూర్య కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మేకర్స్ సినిమాను మే 1న తెలుగుతో పాటు తమిళ భాషలో పాన్ రీజినల్ రీతిలో గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు.

Also Read: మహేష్ హీరోయిన్ పై కన్నేసిన బన్నీ..!

ఇప్పటికే చిత్రానికి సంబంధించి విడుదలైన టీజర్, సాంగ్స్, గ్లింప్స్ ప్రేక్షకుల నుండి భారీ స్పందనను రాబట్టాయి. దీంతో 'రెట్రో'పై ఆడియన్స్ అంచనాలు మరింతగా పెరిగాయి. ముఖ్యంగా సూర్య- పూజా హెగ్డే కాంబినేషన్‌ చూడాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Also Read: కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ బ్రాండ్ న్యూ కార్ అదుర్స్..!

ఇక తాజాగా పూజా హెగ్డే తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా రెట్రో మూవీకి సంబంధించిన డబ్బింగ్ పనులు ప్రారంభమైనట్లు తెలిపారు. ఆమె షేర్ చేసిన ఆ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఈ అప్‌డేట్ సినిమాపై ఉన్న హైప్‌ను మరింత పెంచింది.

pooja retro dubbing
pooja retro dubbing

 

Also Read: 'మంగపతి' గెటప్‌లో శివాజీ స్పెషల్ వీడియో వైరల్

సూర్య స్టైల్, కార్తీక్ సుబ్బరాజ్ విజన్, పూజా హెగ్డే గ్లామర్ మేళవింపుతో 'రెట్రో' ఈ సమ్మర్‌లో ఓ మోస్ట్‌వాంటెడ్ మూవీగా మారిందనడంలో సందేహమే లేదు.

#Retro #surya #pooja hegde
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు