యువత భవిష్యత్ తో ఆడుకోవద్దు.... కర్ణాటక ప్రభుత్వ నిర్ణయంపై కేంద్ర మంత్రి ఫైర్...! జాతీయ విద్యా విదానాన్ని కర్ణాటకలో రద్దు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఫైర్ అయ్యారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ)పై ఆయన చేసిన అనుచిత ప్రకటనలు ఢిల్లీలోని తమ రాజకీయ గురువులను సంతోష పెట్టవచ్చన్నారు. By G Ramu 22 Aug 2023 in నేషనల్ New Update షేర్ చేయండి జాతీయ విద్యా విదానాన్ని కర్ణాటకలో రద్దు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని విద్యార్థి వ్యతిరేక చర్యగా ఆయన అభివర్ణించారు. యువత భవిష్యత్తుతో ఆడుకోవద్దని ఆయన కోరారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ)పై ఆయన చేసిన అనుచిత ప్రకటనలు ఢిల్లీలోని తమ రాజకీయ గురువులను సంతోష పెట్టవచ్చన్నారు. అయితే ఆయన వ్యాఖ్యలు కర్ణాటక విద్యార్థుల ప్రయోజనాల పట్ల రాజీ పడేలా వున్నాయని ఫైర్ అయ్యారు. ఎన్ఈపీ అనేది 21వ శతాబ్దానికి సంబంధించిన భవిష్యత్తు పత్రమని, అంతేకానీ అదేమి రాజకీయ పత్రం కాదని మండిపడ్డారు. ఎన్ఈపీ అనేది 21వ శతాబ్దంలో అభివృద్ది చెందుతున్న టెక్నాలజికీ సంబంధించిందన్నారు. పాఠశాల వ్యవస్థలో నైపుణ్య ఆధారిత విద్యాకు సంబంధించిందన్నారు. కాంగ్రెస్ నేతలు ఎలాంటి రాజకీయాలు చేయాలనుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. రాజకీయాలను పొలిటికల్ మార్గంలోనే వుండాలన్నారు. అంతే కానీ యువ తరం భవిష్యత్తుతో ఆడుకునేలా ఉండకూడదన్నారు. కర్ణాటకలో ఎన్నికలకు ముందు మెనిఫెస్టోలో ఓటర్లకు కాంగ్రెస్ పలు కీలక హామీలను ఇచ్చింది. రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏర్పాటయితే జాతీయ విద్యా విదానాన్ని రాష్ట్రంలో రద్దు చేస్తామని ప్రకటించింది. అందులో భాగంగా ఇటీవల బడ్జెట్ సమావేశాల్లో కర్ణాటక సీఎం సిద్దరామయ్య ప్రకటన చేశారు. ఎన్ఈపీ స్థానంలో రాష్ట్ర విద్యా విదానాన్ని తీసుకు వస్తామన్నారు. అనంతరం ఎన్ఈపీని రద్దు చేస్తున్నట్టు, వచ్చే ఏడాది నుంచి ఎన్ఈపీ అమలులో వుండబోదన్నారు. #students #education #dk-shiva-kumar #nep #dharmendr-pradhan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి