Anand Mahindra: 'వీళ్లతో పెట్టుకోకండి'.. ప్రపంచ దేశాలకు ఆనంద్ మహీంద్ర హెచ్చరిక..

గణతంత్ర వేడుకలకు సంబంధించి ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర మరో వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేశారు.' ఇతర దేశాల ఆర్మీకి నేనో వ్యక్తిగత సలహా ఇస్తున్నాను. వీళ్లతో ఎప్పుడు కూడా పెట్టుకోకండి' అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

New Update
Anand Mahindra: లండన్‌ లో డబ్బావాలా.. ఆనంద్‌ మహీంద్రా ట్విట్‌ వైరల్‌!

సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్‌గా ఉండే ప్రముఖుల్లో ఒకరు ఆనంద్ మహింద్రా. ఈ ప్రపంచంలో ఉండే కొన్ని ఆసక్తికరమైన వీడియోలను తన ఎక్స్‌ (ట్విట్టర్) ఖాతాలో షేర్ చేస్తూ.. వాటిపై తన అభిప్రాయాన్ని పంచుకుంటారు. అందులో కొన్ని సందేశాత్మకంగా ఉంటాయి. మరికొన్ని విచిత్రంగా కూడా ఉంటాయి. అయితే శుక్రవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో జరిగిన పరేడ్‌ అందిరినీ ఆకట్టుకుంది. అయితే ఈసారి దీనిపై ఈ ప్రముఖ పారిశ్రామిక వేత్త స్పందించారు. సైనిక శక్తిని కొనియాడుతూ.. ఇతర దేశాలను ఉద్దేశించి ఓ హెచ్చరిక చేశారు.

Also Read:  జనసేన..టీడీపీ.. ఔర్ బీజేపీ.. ఏమవుతోంది?

పరేడ్‌లో సైనిక కవాతుకు సంబంధించిన ఓ వీడియోను ఎక్స్‌లో పోస్టూ చేశారు. ' ఇతర దేశాల ఆర్మీకి నేనో వ్యక్తిగత సలహా ఇస్తున్నాను. వీళ్లతో ఎప్పుడు కూడా పెట్టుకోకండి' అంటూ రాసుకొచ్చారు. అలాగే ఇండియన్ ఆర్మీ శక్తి సామర్థ్యాలను గుర్తించేలా.. భారత్‌ ధృఢంగా ఉంది అనే అర్థం వచ్చేలా ఎమోజీలు కూడా యాడ్‌ చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ ట్వీట్‌ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఇదిలాఉండగా.. ఈసారి గణతంత్ర వేడుకల సందర్భంగా మన సైనిక సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పారు. ఇండియాలోనే తయారుచేసిన ఆయుధాలతో సహా.. నాగ్‌ క్షిపణులు, టీ-90 భీష్మ యుద్ధ ట్యాంకులు. డ్రోన్‌ జామర్లు, నిఘా వ్యవస్థలు, బీఎంపీ-2 సాయుధ శకటాలు సహా వివిధ దేశీయ ఆయుధాలను ప్రదర్శించారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే తొలిసారిగా త్రివిధ దళాల్లో పూర్తిస్థాయిలో మహిళలు కవాతులు, విన్యాసాలు చేసి ఆకట్టుకున్నారు.

Also Read:  ప్రపంచ కుబేరుడు ఎలోన్ మస్క్ కిందకు జారిపోతున్నాడా?

Advertisment
Advertisment
తాజా కథనాలు