Dogs Attack: విషాదం.. కుక్కల దాడిలో గాయపడిన బాలుని మృతి 

షేక్ పేటలో ఈనెల 8 వతేదీన ఒక గుడిసెలోకి కుక్కలు చొరబడి.. అక్కడ నిద్రిస్తున్న 5 నెలల శరత్ అనే బాలుడిని తీవ్రంగా గాయపరిచాయి. ఉస్మానియా ఆసుపత్రిలో అప్పటి నుంచి చికిత్స పొందుతున్న బాలుడు మరణించాడు.

New Update
Dogs Attack: విషాదం.. కుక్కల దాడిలో గాయపడిన బాలుని మృతి 

Dogs Attack: ఇటీవల కాలంలో చిన్నారులు కుక్కల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు బాగా పెరిగిపోతున్నాయి. రోడ్డుపై వెళుతున్న చిన్నారులపై కుక్కలు దాడి చేయడం.. పిల్లలు గాయాలు పాలవడం ఎక్కువగా జరుగుతున్నాయి. హైదరాబాద్ లో ఈ ఏడాది ఇలాంటి సంఘటనలు చాలా నమోదు అయ్యాయి. అయితే, కుక్కల దాడిలో చిన్నారులు చనిపోయిన ఘటనలు కూడా ఈ ఏడాది చోటుచేసుకున్నాయి. వీధిలో ఆడుకుంటూ కుక్కల దాడికి గురవ్వడం అనేది సర్వసాధారణ విషయంగా మారిపోయింది.  అయితే, అందుకు విరుద్ధం గా ఇంటిలోకి వెళ్లిమరీ బాలునిపై కుక్కలు దాడిచేసిన సంఘటన షేక్‌పేటలో చోటు చేసుకుంది. 

షేక్ పేటలో ఈనెల 8 వతేదీన ఈ సంఘటన జరిగింది. ఇక్కడి వినోభానగర్ లో నివాసం ఉంటున్న అంజి, అనూష దంపతులు కూలిపనులు చేసుకుని జీవిస్తున్నారు. వీరికి ఐదు నెలల బాబు శరత్ ఉన్నాడు. ఎప్పటిలానే తమ శరత్ ను తమ గుడిసెలో నిద్రపుచ్చి తమ పనుల కోసం బయటకు వెళ్లారు. తరువాత కాసేపటికి ఇంటికి వచ్చి చూసేసరికి శరత్ గాయాలతో పడి ఉన్నాడు. దీంతో వారు వెంటనే బాలుడిని అక్కడి దగ్గరలోని ఒక ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయితే, అక్కడి వైద్యులు బాలుని నీలోఫర్ ఆసుపత్రికి పంపించారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం అని చెప్పి ఉస్మానియా ఆసుపత్రికి బాలుని పంపించారు. అక్కడ  గత 17 రోజులుగా బాలునికి చికిత్స అందిస్తున్నారు. అయితే, ఈరోజు ఆ బాలుడు మరణించాడు. తమ బాలుని మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. 

బాలునిపై కుక్కలు దాడిచేసినట్లు సిసి టీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. బాలుని మరణంతో స్థానిక ప్రజలు విషాదంలో మునిగిపోయారు.

Also Read: ఘోరం.. ఎలుక కొరకడంతో శిశువు మృతి

తరచుగా ఇలానే..  

హైదరాబాద్ లోనే కాకుండా ఇలా కుక్కల(Dogs Attack) బారిన పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్న సంఘటనలు దేశవ్యాప్తంగా చాలా చోటుచేసుకుంటున్నాయి. ఇంతకుపాటు పోరాటం చేసి  ప్రాణాలు కోల్పోయింది. పోచమ్మపల్లి గ్రామంలో 13 ఏళ్ల బాలిక స్కూలు నుంచి ఇంటికి వస్తుండగా ఇంటి బయట ఈ సంఘటన జరిగింది. 

అంతకు ముందు జరిగిన వేరొక సంఘటనలో, హైదరాబాద్‌లోని బహదూర్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని నంది ముసలాయిగూడలో వీధికుక్క దాడి కారణంగా ఆరేళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. మరో కేసులో ఐదేళ్ల బాలుడు వీధికుక్కల దాడికి గురయ్యాడు. 

ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలోని గార్డెన్ గ్లోరీ సొసైటీలో ఓ మహిళా వైద్యురాలిపై గోల్డెన్ రిట్రీవర్ పెంపుడు కుక్క(Dogs Attack) దాడి చేయడంతో ఆమె ముఖంపై తీవ్ర గాయాలు కావడంతో మరణించింది.

Watch this Interesting Video:

Advertisment
Advertisment
తాజా కథనాలు