తల్లి మరణించినా.. కడుపులో బిడ్డను కాపాడిన వైద్యులు!

ఓ మృతిరాలి గర్భం నుంచి నవజాతి శిశివు ప్రాణాలు కాపాడిన ఘటన గాజాలో చోటుచేసుకుంది.గాజా పై నిన్నరాత్రి ఇజ్రాయెల్ దాడి చేసిన ఘటనలో తీవ్ర గాయాల పాలైన ఓ గర్భిణీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. కడుపులోని శిశివు గుండె కొట్టుకోవటం వైద్యులు గమనించి ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడారు.

New Update
తల్లి మరణించినా.. కడుపులో బిడ్డను కాపాడిన వైద్యులు!

మానవత్వం క్రూరత్వంగా మారిన చోట, వైద్యులు భూమిపై దేవుళ్లుగా కనిపిస్తారు..గాజా పై ఇజ్రాయెల్ దాడిలో  ఓ మృతిరాలి గర్భం నుంచి వైద్యులు నవజాతి శిశివుకు జన్మనిచ్చిన ఘటన చోటుచేసుకుంది. తొమ్మిది నెలల గర్భవతి అయిన ఓలా అద్నాన్ హర్బ్ అల్-కుర్ద్, నుస్సెరాట్ శరణార్థి శిబిరంలో నివసిస్తుంది. రాత్రిపూట ఒక్కసారిగా ఇజ్రాయెల్ దాడి చేయటంతో ఆమె ప్రమాదానికి గురైంది. ఘటన తర్వాత అక్కడి చేరుకున్న సహాయక బృందాలు గాజాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి ఆమెను తరలించారు.

తీవ్రంగా గాయపడిన ఆ గర్భిణీ స్త్రీని వైద్యులు రక్షించే ప్రయత్నం చేశారు.కానీ ఆమెకు తీవ్ర గాయాలు పాలవటంతో చికిత్స పొందుతూ మరణించింది. ఆ కొద్ది సేపటికి మృతిరాలి కడుపులోని బిడ్డ గుండె కొట్టు కున్నట్లు వైద్యులు గుర్తించారు.దీంతో ఆపరేషన్ చేసి వైద్యులు శిశివు ప్రాణాలు కాపాడారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు