Home made Tomato Ketchup :మార్కెట్ లో లభించే టమాటో సాస్ వాడుతున్నారా ? ఇక .. మీ పని అంతే !! By Nedunuri Srinivas 22 Jan 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Home made Tomato Ketchup : ఇప్పుడంతా ఆన్లైన్ ఆర్డర్స్ , ఉయొనే ఇంట్లో రెగ్యులర్ గా వాడే పచ్చళ్ళ దగ్గరనుంచి బేక్ ఐటమ్స్ వరకూ అన్నీ ఆన్లైన్లోనే. అయితే . వీటిలో కొన్ని ఆహార పదార్ధాలు ఆరోగ్యానికి అంత మంచివి కావు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా ఇంట్లో మనం రెగ్యులర్ గా వాడే మార్కెట్ లో లభించే టమాటో సాస్ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. నాణ్యమైన టమాటోలతో ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు టమాటోల్లో విటమిన్ బి6, పొటాషియం, మాంగనీస్, మెగ్నిషియం, పాస్పరస్ వంటి ఖనిజాలు కడుపులోని అల్సర్‌ను నివారిస్తాయి. టమోటాలోని యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ వ్యాధుల నుండి కాపాడుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ను బయటకు పంపుతుంది. టమోటా జ్యూస్ తాగడం వలన గాల్‌స్టోన్స్ సమస్యలు ఉండవు.ఇన్ని ప్రయోజనాలున్న టమాటోలతో ఇంట్లోనే సాస్ చేసుకోవచ్చు. జీర్ణవ్యవస్థపై ప్రభావం టొమాటో సాస్ చిన్న పిల్లలనుంచి పెద్దవాళ్ల వరకు అందరూ ఇష్టపడి తింటారు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లోనైనా , బేకరీ స్నాక్స్ లోనైనా అడిగి మరీ వేసుకుని తింటారు. అయితే ఇలా మార్కెట్ లో తయారైన టొమాటో సాస్ వల్ల జీర్ణశక్తి దెబ్బతింటుందని చాలా మందికి తెలియదు. మరి.. ఇంతలా ఇష్టపడే ఈ టొమాటో ఇంట్లోనే తయారు చేసుకుని నిల్వఉంచుకోవచ్చు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే..మనం ఇంట్లోనే తయారు చేసుకునే సాస్ చాలా కాలం పాటు డబ్బాలో ఉంచుకోవచ్చు. ఈ సాస్ రుచిగా , శుచిగా తయారు చేసుకునే సులభమైన విధానం తెలుసుకుందాం. అవసరమైన పదార్థాలు 1 కిలోల టమోటా పేస్ట్ 1 కప్పు మొక్కజొన్న సిరప్ వైట్ బి = వెనిగర్ చక్కెర పొడి ఉప్పు ఉల్లిపాయ పొడి వెల్లుల్లి పొడి ఈ పదార్ధాలను సిద్ధం చేసుకున్న తరువాత ముందుగా ఒక పాన్ తీసుకుని మీడియం మంట మీద ఉంచాలి.ఇప్పుడు పాన్‌లో పైన పేర్కొన్న పదార్థాలన్నింటినీ వేసి బాగా కలపాలి. ఇప్పుడు సాస్ కనీసం 20 నిమిషాలు మీడియం మంట మీద బాగా ఉడికించాలి.- పాన్ పై ఎలాంటి మూత పెట్టకూడదని గుర్తుంచుకోండి. ఈ పదార్ధాలన్ని చిక్కగా మగ్గేవరకుసాస్‌ను గరిటెతో కలుపుతూ ఉండాలి. బాగా చిక్కగా అయిన తరువాత గ్యాస్‌ను ఆపివేసి, ఆపై చల్లని ప్రదేశంలో ఆ సాస్ బౌల్ ని ఉంచండి. అంతా రెడీ అయినాక ఈ సాస్‌ను గాలి చొరబడని కంటైనర్‌లో 3 వారాల పాటు రిఫ్రిజిరేటర్‌లో మరియు 6 నెలల పాటు ఫ్రీజర్‌లో ఉంచవచ్చు.ఇలా చేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ సాస్ వాడుకోవచ్చు. ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి లభిస్తాయి. ఈ విషయాలను కూడా గుర్తుంచుకోండి అయితే .. ఈ సాస్ తయారు చేసుకునే ముందు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. చవకగా వస్తున్నాయని పనికిరాని టొమాటోలను కొనవద్దు. కుళ్ళినవి ఉంటే సాస్ చేదు వాసన వస్తుంది. అందుకోసం మంచి టొమోటోలను కొనాలి. టొమాటో ప్యూరీని తయారు చేసిన తర్వాత, దానిని జల్లెడ ద్వారా ఫిల్టర్ చేయడం మర్చిపోవద్దు.ఇది తయారు చేసేటప్పుడు ఎలాంటి కృత్రిమ ఆహార రంగులను ఉపయోగించవద్దు.ఇంటిల్లిపాదీ ఇష్టంగా తినే ఈ సాస్ నాణ్యమైన ఇంగ్రీడియన్స్ తో చేస్తే సాస్ చాలా రుచికరంగా ఉంటుంది. ఏదయినా మితంగా వాడితే అంతా ఆరోగ్యమే. బాగుంది కదా అని ఎక్కువగా వాడితే ఇంట్లో తయారు చేసే టొమాటో కెచప్ తో సైతం అనర్ధాలే. టొమాటో కెచప్‌ని ఎక్కువగా ఉపయోగించడం వల్ల స్థూలకాయం సమస్య పెరుగుతుంది. ఎసిడిటీ సమస్య వస్తుంది. (గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.) ALSO READ:వాము రసం తయారీ విధానం ఇదే.. తాగితే ఎన్నో ప్రయోజనాలు! #healthy-foods #tomato #5-best-foods #home-made-tomato-ketchup #markrt-tomato-ketchup మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి