జుట్టు తెల్లబడుతోందా? ఈ తొక్కను ఈ విధంగా వాడండి..!!

కొందరికి చిన్న వయస్సులోనే జుట్టు తెల్లబడుతుంది. ఇందుకు జీవనశైలి,ఆహారపు అలవాట్లు, విటమిన్ లోపం, ఇలా ఎన్నో కారణాలుంటాయి. ఈ సమస్యను అదుపులోకి తీసుకురావాలంటే ఈ చిట్కాలు పాటించండి.

New Update
జుట్టు తెల్లబడుతోందా? ఈ తొక్కను ఈ విధంగా వాడండి..!!

publive-image

నేటి జీవనశైలి కారణంగా...చిన్నవయస్సులోనే చాలామందికి జుట్టు తెల్లబడుతోంది. ఈసమస్యను ఎదుర్కొంటున్నవారు కోట్ల సంఖ్యలో ఉన్నారు. కాలుష్యం, రసాయన ఉత్పత్తులు, జన్యులోపాలు, విటమిన్స్ లోపం...ఇవన్నీ జుట్టు తెల్లబడటానికి కారణాలు. చాలా మంది తెల్ల జుట్టును నల్లగా మార్చుకునేందుకు మార్కెట్లో లభించే రకరకాల ఉత్పత్తులను వాడుతుంటారు. వాటిలో కెమికల్స్ ఎక్కువగా ఉండటం వల్ల జుట్టు పాడవుతుంది. అయితే ఇలాంటి సమస్య నుంచి విముక్తి పొందేందుకు బంగాళదుంప తొక్కలు బెస్ట్ హోం రెమెడిగా ఉపయోగించవచ్చు. బంగాళదుంపలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది కాలక్రమేణా జుట్టును నల్లగా చేస్తుంది. అంతేకాదు జుట్టులో కొల్లాజెన్ పెంచుతుంది. మీ జుట్టు రంగును మెరుగుపరుస్తుంది.

బంగాళదుంప తొక్కను ఎలా ఉపయోగించాలో చూద్దాం.

తెల్ల జుట్టు నివారణ కోసం బంగాళాదుంప తొక్కను అనేక విధాలుగా ఉపయోగించవచ్చు. మొదటి మార్గం 5 లేదా 6 బంగాళదుంపల తొక్కలను తీసుకుని ఉడకబెట్టాలి. నీరు చిక్కబడే వరకు ఉడికించాలి. షాంపూ చేయడానికి ముందు జుట్టుకు ఈ నీటిని అప్లై చేయండి. ఈ నీటిలో కాఫీ పౌడర్, అలోవెర జెల్, రోజ్ వాటర్ ను యాడ్ చేయండి. దీన్ని మీ జుట్టుకు పట్టించి దాదాపు అరగంటపాటు అలాగే ఉంచి..గోరవెచ్చని నీటితో శుభ్రం చేయండి.

బంగాళదుంప తొక్క ప్రయోజనాలు:
తెల్లజుట్టుకు బంగాళాదుంప తొక్క అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. వీటిలో టైరోసినేస్ అనే పాలీఫెనాల్ ఆక్సిడేస్ ఎంజైమ్ ఉంటుంది. ఇది మీ జుట్టును నల్లగా మార్చడంలో సహాయపడుతుంది. కట్ చేసిన బంగాళదుంప ఎలా నల్లగా మారుతుందో...బంగాళదుంప తొక్కతో తయారు చేసిన నీటిని ఉపయోగించడం వల్ల మీ జుట్టు కూడా నల్లగా మారుతుంది.

ఈ నీటిలో ఐరన్, జింక్, రాగి, కాల్షియం, పొటాషియం, నియాసిన్, మెగ్నీషియం ఉంటాయి. ఇది గ్రే హెయిర్‌కే కాదు, జుట్టు రాలడాన్ని తగ్గించే గుణం కూడా కలిగి ఉంది. కాబట్టి, మీ జుట్టు త్వరగా నెరిసిపోతుంటే, మీరు బంగాళాదుంప తొక్కను ఈ విధంగా ఉపయోగించవచ్చు. ఇది మీ జుట్టుకు అన్ని విధాలుగా మేలు చేస్తుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు